logo
సినిమా

మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి...నిజ జీవితంలో కూడా 'నేచురల్'గా నటిస్తావు

మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి...నిజ జీవితంలో కూడా నేచురల్గా నటిస్తావు
X
Highlights

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, అవకాశాలు ఇవ్వకుండా...

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించి, అవకాశాలు ఇవ్వకుండా చేసిన ఇండస్ట్రీ పెద్దల బండారం ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఇండస్ట్రీ పెద్దల్లో దడ పెట్టిస్తోంది శ్రీరెడ్డి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా మరో లీక్ చేసింది. ఆమె చేసిన ఆరోపణలను ఆమె మాటల్లోనే చూద్దాం.

"నీవు స్క్రీన్ మీదే కాదు.. నిజ జీవితంలో కూడా చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తావు. నీవు నేచురల్ గా కనిపిస్తావు. కానీ అది ముసుగు మాత్రమే. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని నీవు చెప్పుకుంటావు. కానీ, అందంతా జనాల సానుభూతి కోసమే. జనాల ముందు నీవు చాలా బాగా డ్రామా ప్లే చేస్తావు. నీ కంటే పెద్ద హీరోలే చాలా బెస్ట్. వాళ్లకు వాళ్ల తండ్రులు, తాతల అండ ఉన్నప్పటికీ... ఎంతో నిజాయతీగా, సిన్సియర్ గా ఉంటారు. సూపర్ స్టార్లు చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల నుంచి నీవు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వారికి అహంభావం ఉండదు. వాళ్ల యాటిట్యూడ్ చాలా గొప్పది.

చిన్న దర్శకులను, ఇప్పుడే ఎదుగుతున్న దర్శకులను నీవు గౌరవించవు. ఇటీవలే నీకు కొడుకు పుట్టాడు. కంగ్రాచులేషన్స్. కానీ, జీవితంలో జాగ్రత్తగా ఉండు. ఎంతో మంది అమ్మాయిలను నీవు వాడుకున్నావు. వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకో. న్యాయం అనేది ఎప్పుడూ మంచి వైపే ఉంటుంది. కాకపోతే శిక్షకు కొంచెం సమయం పడుతుంది. నీవు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతావ్. సినీ పరిశ్రమ నిన్ను శిక్షిస్తుంది. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివన్నీ ఈకలా రాలిపోవాలి." అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Next Story