logo
సినిమా

ఆ దర్శకుడి బాగోతం బయట పెడతా!

ఆ దర్శకుడి బాగోతం బయట పెడతా!
X
Highlights

టాలీవుడ్ లో శ్రీరెడ్డి లీక్స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. న్యూస్ ప్ర‌జెంట‌ర్ , యాక్ట‌ర్ గా అంచెలంచెలుగా ఎదిగిన...

టాలీవుడ్ లో శ్రీరెడ్డి లీక్స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. న్యూస్ ప్ర‌జెంట‌ర్ , యాక్ట‌ర్ గా అంచెలంచెలుగా ఎదిగిన శ్రీరెడ్డి తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూతో వెలుగులోకి వ‌చ్చారు. కెరియ‌ర్ పీక్ లో ఉన్న‌ప్పుడు త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి వాపోయింది. అవ‌కాశాల‌పేరిట క‌మిట్మెంట్ కోసం పాకులాడే డైర‌క్ట‌ర్స్, ప్రొడ్యూస‌ర్స్ చాలా మందే ఉన్నారంటూ మండిప‌డింది. త‌మ దాహాన్ని తీర్చుకునేందుకు అవ‌కాశాలు ఇప్పిస్తామంటూ వాడుకొన్న‌వారు చాలామందే ఉన్నారంటూ ఆరోపించింది.

ఇటీవలి కాలంలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై బహిరంగంగా విరుచుకపడుతున్న నటి శ్రీరెడ్డి.. దర్శకుడు అజయ్ కౌండిన్య పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెడుతూ.. తనను డైరెక్టర్ గా చెప్పుకుంటూ ఒక్క సినిమా కూడా చేయకుండా దర్శకులందరి పరువు తీస్తున్న అజయ్ కౌండిన్య జైలుకు వెళ్ళడం ఖాయమని పేర్కొంది. సినీ రంగంలోని చీకటి కోణాలను బయట పెడతా..కొందరు హీరోలు, దర్శకనిర్మాతలు కూడా ఇలాంటి ” అరాచకాలకు ” పాల్పడుతుంటారు..వారి వివరాలను బహిర్గతం చేస్తా ” అని శ్రీరెడ్డి ఈ మధ్య చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో హెచ్చరించింది కూడా.

Next Story