మరిదితో రొమాన్స్..నాకే అసహ్యం వేసింది : సంగీత

నటి సంగీత హోమ్లీగాను, రొమాంటిక్ హీరోయిన్ గా ను మెప్పించింది. 2000 తరువాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో అధిక...
నటి సంగీత హోమ్లీగాను, రొమాంటిక్ హీరోయిన్ గా ను మెప్పించింది. 2000 తరువాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో అధిక చిత్రాల్లో నటించింది. ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి వంటి తెలుగు చిత్రాలలో సంగీత నటించింది. తమిళ భాషలో కూడా సంగీత నటించింది. సంగీత నటించిన చిత్రాలలో తమిళ చిత్రం ఉయిర్ కాంట్రవర్సీగా మారింది. 2006 లో ఈ చిత్రం విడుదలయింది. తెలుగులో ఈ చిత్రం మనోహరం పేరుతో విడుదలయింది. దాదాపు దశాబ్దం తరువాత ఈ చిత్రం గురించి సంగీత మాట్లాడింది.
తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ‘ఉయుర్’ అనే తమిళ చిత్రం ద్వారా తనకు ఎక్కువ పేరు వచ్చిందని అయితే ఆ పాత్రను అయిష్టంగా చేశా అన్నారు సంగీత. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నాకూ నిర్మాతలకు మధ్య గొడవలు అయ్యాయి. దీనికి కారణం ఈ చిత్రంలో నాది బోల్డ్ క్యారెక్టర్. చిత్రంలో ఓ మహిళ తన భర్తకు ఆహారంలో డ్రగ్స్ కలిపి ఇచ్చి.. తన మరిదితో కామ కోరికలు తీర్చుకుంటుంది. మొదట్లో ఆ క్యారెక్టర్ లో నేను నటించగలనా..అంత ధైర్యం చేయాలా అన్ని ఆలోచన వచ్చింది.. అయితే దర్శకుడు సామి నాకు కథ చెప్పినప్పుడు.. ఇది బోల్డ్ క్యారెక్టర్ కాబట్టి కాస్త ఎక్స్‌పోజ్ చేయాలన్నారు. నేను చేయనని చెప్పేశా. అసభ్యకర సన్నివేశాలు లేకుండా ఉంటే నటిస్తానని చెప్పా.
దర్శకుడితో పాటు నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి ఎలాగోలా ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నా కెరియర్‌కి బ్రేక్ ఇచ్చింది ‘ఉయర్’ చిత్రం. ఆ సినిమాను అమ్మతో కలిసి థియేటర్‌లో చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా.. మరిదితో రొమాన్స్ చేసే సీన్‌లు నా మనసుకు ఏ మాత్రం నచ్చలేదు. వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని లేచే సమయంలో మా అమ్మగారు ఇది సినిమా..కొన్ని క్యారెక్టర్స్ అలా చేయాల్సి వస్తుంది...అప్పుడే మంచి నటిగా గుర్తిస్తారు అని అన్నారు. ఆమె బలవంతంగా ఆ సినిమా పూర్తిగా చూడగలిగా. ఆ తరువాత ఆ సినిమా మళ్లీ ఎప్పుడూ చూడలేదు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Ram Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
28 May 2022 9:48 AM GMTPM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్‌బ్రాండ్స్‌కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMT