కాబోయే భర్త గురించి రేణూ దేశాయ్...తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లు...

నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం నటి రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న...
నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం నటి రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయాన ఆమే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో పవన్ వీరాభిమానులు ఆమె మరో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తప్పులేదు.. తాను రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అన్నట్లుగా పవన్ అభిమానులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆమె. ఈ కౌంటర్‌తో పవన్ అభిమానులు మరోసారి ఆమె జోలికి వెళ్లలేదు. దీంతో అప్పట్నుంచి తన జీవిత భాగస్వామి కోసం రేణూ వెతకడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తనకు భాగస్వామి దొరికినట్లు ఇటీవల వెల్లడించారు. ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను పంచుకున్నారు. అయితే ప్రస్తుతం రేణూ తన పిల్లలు, స్నేహితులతో కలిసి గోవాలో విహరిస్తున్నారు. అయితే తన స్నేహితులు తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లు చదివే ప్రైవసీని ఇవ్వడంలేదట.
ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. స్విమ్ డ్రెస్‌లో ఫోన్ చూస్తున్నప్పుడు తీసిన ఫొటోను రేణూ పోస్ట్ చేశారు. ఈ ఫొటోను తన స్నేహితులు తీశారట. అయితే ఆ సమయంలో తాను తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లను చదువుతున్నానని, కానీ తన స్నేహితులు ఫొటోలు తీస్తూ తనకు ప్రైవసీ ఇవ్వడంలేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే త్వరలో రేణూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇటీవల తనకు కాబోయే భర్త చేయిపట్టుకుని దిగిన ఫొటో పోస్ట్ చేస్తూ..‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అని పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని మాత్రం రేణూ వెల్లడించలేదు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
21 May 2022 9:45 AM GMTRaw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!
21 May 2022 9:30 AM GMTతిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMT