రూ. 40 వేలు రేటు కట్టారు.. నటి అపూర్వ కంప్లైంట్

రూ. 40 వేలు రేటు కట్టారు.. నటి అపూర్వ కంప్లైంట్
x
Highlights

వెబ్ సైట్‌లో తన ఫొటో పెట్టి 40వేలు రేటు కట్టారంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది నటి అపూర్వ. దీంతో తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా ఆన్ లైన్...

వెబ్ సైట్‌లో తన ఫొటో పెట్టి 40వేలు రేటు కట్టారంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది నటి అపూర్వ. దీంతో తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా ఆన్ లైన్ మాధ్యమంగా మాజీ ప్రిన్సిపాల్ చొక్కారపు గణేష్ చేస్తున్న అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. కాల్‌గర్ల్స్‌ అంటూ హీరోయిన్ల ఫోటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఒక్కో హీరోయిన్‌కు...ఒక్కో రేటు ఫిక్స్‌ చేశాడు. గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక గణేష్ పెట్టిన పోస్టింగ్స్ లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా ఉండటంతో, అవి ఎవరివన్న కోణంలోనూ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే, తనపై ఫిర్యాదు ఇచ్చిన విషయాన్ని తెలుసుకున్న గణేష్, ‘లొకాంటో’ వెబ్ సైట్ లో తాను పెట్టిన పోస్టింగ్స్, చిత్రాలన్నింటినీ డిలీట్ చేశాడని, ఇప్పుడు వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. హీరోయిన్ల ఫొటోలు చూపించి, విటుల నుంచి ఆన్ లైన్ మాధ్యమంగా గణేష్ రూ. 2 లక్షల వరకూ వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories