చిన్నారి కలను నిజం చేసిన సూర్య...ఆ బాలుడి ఖర్చు భరిస్తానని హామీ!

సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం నటన మాత్రమే కాదు, సేవా...
సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం నటన మాత్రమే కాదు, సేవా గుణం, అభిమానుల పట్ల చూపించే ప్రేమ ఆయన్ను ఇంత గొప్పస్థాయికి తీసుకొచ్చిందని చెబుతుంటారు. తాజాగా మరోసారి సూర్య తన పెద్ద మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న దినేశ్ అనే బాలుడికి తన అభిమాన నటుడైన సూర్యను చూడాలనిపించిందట. కుర్రాడికి నటుడు సూర్యను కలవాలన్నది చిరకాల కల అట. ఈ విషయం తెలుసుకున్న సూర్య .. ఆ పిల్లాడిని తన ఇంటికి పిలిపించుకుని సరదాగా గడిపారు. ఆ పిల్లాడికి కొన్ని కానుకలను అందజేయడమే కాకుండా .. సెల్ఫీలు కూడా తీసుకుని అతణ్ణి ఉత్సాహపరిచారు. అంతే కాకుండా ఆ పిల్లవాడి వైద్యానికి ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని హామీ ఇచ్చారట. ఆ పిల్లాడి తల్లిదండ్రులు సూర్యకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ సూర్య మంచి మనసును అభినందిస్తున్నారు.
• Exclusive : Thalaivan @Suriya_offl 's inspiring words to his Kutty fan #DineshKumar From #Theni ♥ #suriya #AltruisticSuriya @rajsekarpandian @prabhu_sr pic.twitter.com/0zCbBRrAXX
— Surya Fans Club™ (@SuriyaFansClub) September 19, 2018
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT