తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ అత్యవసర సేవలూ బంద్..

తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ అత్యవసర సేవలూ బంద్..
x
Highlights

తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవల్ని నిలిపేసినట్లు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల...

తెలంగాణలో ఇవాల్టి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవల్ని నిలిపేసినట్లు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం : EHS , జర్నలిస్టుల ఆరోగ్య పథకం : JHS కింద కూడా అన్ని సేవలను ఆపేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన 1200 కోట్ల బకాయిలు పెండింగులో పెట్టడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం వల్లే సేవల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. పది రోజులుగా ఔట్ పేషెంట్ సేవలు, వైద్య పరీక్షలను మాత్రమే నిలిపివేసిన ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు తాజాగా ఇన్ పేషెంటు సేవలతో పాటు , ఆపరేషన్లు, రోగ నిర్ధారణ పరీక్షలను నిలిపివేయడంతో రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

బకాయిలు చెల్లింపుల్లో జాప్యాన్ని నిరశిస్తూ 10 రోజులుగా ఔట్ పేషెంట్ సేవలను ఆపివేశాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వైద్య సేవల్ని పూర్తి స్థాయిలో నిలిపివేయండతో పేదలు, EHS , JHS బాధితులంతా ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలు తీర్చకుంటే సేవలు నిలిపివేస్తామని 20 రోజుల క్రితమే నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం వైద్య ఆరోగ్యశాఖకు, ఆరోగ్యశ్రీకి నోటీసులిచ్చింది. తాజాగా ఆందోళనను ఉధృతం చేసింది. అయితే ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్న నెట్ వర్క్ ఆసుపత్రులకు 1200 కోట్ల రూపాయలకుగానూ 150 కోట్లను విడుదల చేశామని వైద్య ఆరోగ్య శాఖ నిన్న తెలిపింది. డిసెంబరులో మిగిలిన బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని అంటోంది. బకాయిలను చెల్లిస్తున్నా ఆసుపత్రులు సేవల నిలిపివేయడం సరికాదని, వైద్య సేవల నిలిపివేతను ఉపసంహరించుకోవాలని సూచించింది.

తెలంగాణలో 236 ప్రైవేటు నెట్ వర్క్, 96 ప్రభుత్వ నెట్ వర్క్ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటికితోడు మరో 67 డెంటల్ నెట్ వర్క్ ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రులకు ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయలు బకాయి పడింది. దీంతో ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్ వర్క్ ఆస్పత్రులు ఆందోళన ఉధృతం చేశాయి. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రతీ రోజూ దాదాపు 10 వేల మంది ఔట్ పేఫెంట్లు, వేల మంది ఇన్ పేషెంట్లు వస్తుంటారు. ఇక ఇన్ పేషెంట్లలో ప్రతి రోజు వెయ్యి మందికి వివిధ రకాల ఆపరేషన్లు జరుగుతాయి. ఆపరేషన్లను కూడా ఇవాల్టి నుంచి నిలిపేయడంతో పేదలు, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories