logo
సినిమా

అంత్యక్రియల్లో నవ్వినందుకు..

అంత్యక్రియల్లో నవ్వినందుకు..
X
Highlights

ఇటీవల మరణించిన రాజ్‌కపూర్ భార్య కృష్ణ రాజ్‌కపూర్ ప్రేయర్ మీట్‌లో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు నవ్వుతూ...

ఇటీవల మరణించిన రాజ్‌కపూర్ భార్య కృష్ణ రాజ్‌కపూర్ ప్రేయర్ మీట్‌లో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు నవ్వుతూ ముచ్చటించుకోవడం వివాదాస్పదమైంది. ఓవైపు విషాదంలో కృష్ణ రాజ్‌కపూర్ కుటుంబ సభ్యులు ఉండగా వీళ్ళు అదేదో ఈవెంట్‌కు వచ్చినట్టు చిరునవ్వులు చిందిస్తూ జోకులు వేసుకోవడమేమిటని నెటిజన్లు ఫైరయ్యారు. రాణి ముఖర్జీ, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, అలియా భట్ ఇలా ఆ సమయంలో జోవియల్‌గా కనబడి కెమెరాలకెక్కారు. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నెటిజన్లు వీరు ప్రార్ధనా సమావేశంలో ఎందుకు నవ్వుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నటుల తీరును తప్పుపడుతూ పెద్దసంఖ్యలో కామెంట్లు పోటెత్తాయి. వీరు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారా లేక​ పార్టీలోనా..? అని కామెంట్‌ చేశారు.

Next Story