మొబైల్ నంబర్ ను ఆధార్ తో లింక్ చేశారా?

మొబైల్ నంబర్ ను ఆధార్ తో లింక్ చేశారా?
x
Highlights

మీ మొబైల్ నంబర్లను.. వీలైనంత త్వరగా ఆధార్ నంబర్ తో అనుసంధానం చేసుకోండి లేదంటే.. త్వరలో ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 31తో ఇందుకు సంబంధించిన...

మీ మొబైల్ నంబర్లను.. వీలైనంత త్వరగా ఆధార్ నంబర్ తో అనుసంధానం చేసుకోండి లేదంటే.. త్వరలో ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 31తో ఇందుకు సంబంధించిన గడువు ముగియనుంది. ఆ లోపు ఆధార్ తో మొబైల్ నంబర్ అనుసంధానం పూర్తి కాకుంటే.. అలాగే ప్రభుత్వం గడువు కూడా పెంచకుంటే.. ఏప్రిల్ 1 నుంచి మీ కనెక్షన్లు కట్ అయ్యే అవకాశం ఉంది.

దీంతో.. ఆధార్ తో మొబైల్ నంబర్ అనుసంధానంపై కేంద్రం ప్రచారం కూడా పెంచింది. నెట్ వర్క్ సంస్థల ఔట్ లెట్లు, రిటైలర్ల దగ్గరికి వెళ్లి.. ఆధార్ నంబర్ తో మొబైల్ నంబర్ ను లింక్ చేయొచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే.. 14546 నంబ్ కు కాల్ చేసి.. ఐవీఆర్ఎస్ విధానంలో కూడా పని పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్టు వివరించింది.

మొబైల్ నంబర్లు మిస్ యూజ్ కాకుండా ఉండడం.. ఒక వ్యక్తికి 9 కి మించి కనెక్షన్లు లేకుండా చూడడం.. ప్రజల ఫోన్ నంబర్లను మాయ చేసి ఉగ్రవాదులు వాడకుండా అరికట్టడం.. ఆర్థిక నేరగాళ్లు, క్రిమినల్స్ ఆట కట్టించడం.. ఈ కార్యక్రమ లక్ష్యంగా కేంద్రం చెబుతోంది. మరోవైపు.. మార్చి 31 తో ఈ ప్రక్రియ ఆపేయకుండా.. కనీసం మరో 3 నెలలైనా పొడిగించాలన్న విజ్ఞప్తులు కేంద్రానికి అందుతున్నాయి.

ఈ విషయంలో కేంద్రం ఏం చేసినా చేయికపోయినా.. మీరు మాత్రం వీలైనంత త్వరగా మీ నంబర్లు ఆధార్ తో లింక్ చేయించుకోకండి. కనెక్షన్లు కట్ కాకుండా జాగ్రత్తపడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories