logo
జాతీయం

భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 8 మంది న‌క్స‌ల్స్ బలి

భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 8 మంది న‌క్స‌ల్స్ బలి
X
Highlights

నేడు చ‌త్తీస్‌ఘ‌డ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని స‌క్లార్ గ్రామంలో జ‌రిగిన హోరాహోరీ ...

నేడు చ‌త్తీస్‌ఘ‌డ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని స‌క్లార్ గ్రామంలో జ‌రిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో 8 మంది న‌క్సల్స్ మృత్యుఒడికి చేరారు. డిస్ట్రిక్ రిజ‌ర్వ్ గార్డ్స్‌, కోబ్రా ద‌ళాలు, సీఆర్‌పీఎఫ్ పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. కాగా ఈ ఎదురుకాల్పుల్లో కూడా ఇద్దరు డీఆర్‌జీ పోలీసులు మృతి చెందారు. ఎన్‌కౌంట‌ర్‌లో మ‌రో న‌క్సల్ గాయ‌ప‌డ్డాడు. గాయపడిన వ్యక్తి నుండి ఒక తుపాకిని జప్తు చేసుకున్నారు. కాగా హ‍ోరాహ‍ోరి కాల్పుల్లో వీరమరణం పొందిన న‌క్సల్స్‌, పోలీసుల శవాల‌ను స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ పీపుల్స్ లిబ‌రేష‌న్ గెరిల్లా ఆర్మీ ద‌ళానికి చెందిన న‌క్సల్స్ ఎదురుకాల్పుల్లో చనిపోయారు. మావోల ప్రధాన ప్రాంత‌మైన సుక్మా ప్రాంతంలో పోలీసు ద‌ళాలు ఈ జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వహించారు. ఆదివారం బీజాపూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్దరు భ‌ద్రత సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దింతో అప్రమత్తమైన పోలీసులు చత్తీస్ గఢ్ ప్రధానమైన ప్రాంత్రాల్లో నిఘా పెట్టారు. చుట్టు పక్కల కట్టుదిట్టమైన భారీ భద్రత చేపట్టారు.


Next Story