logo
జాతీయం

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్...ఏడుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్...ఏడుగురు మావోయిస్టులు మృతి
X
Highlights

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ - బీజాపూర్ సరిహద్దులో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు...

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ - బీజాపూర్ సరిహద్దులో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. భారీగా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూసనార్- తిమినార్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో డిస్టిక్ట్‌రిజర్వ్‌గార్గ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. వరుస ఎన్‌కౌంటర్లతో తెలంగాణ సరిహద్దు చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. గత ఐదు నెలలుగా దాడులు ప్రతిదాడులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది.

Next Story