వయసేమో ఆరేళ్ళు.. సంపాదన 70 కోట్లు..

Highlights

ఈ బుజ్జాయిని చూస్తున్నారా? వీడు మామూలోడు కాదు.. పుట్టుకతోనే మాస్టర్ బ్రైన్ తో పుట్టేశాడు.. నాలుగేళ్లొచ్చేసరికి యూట్యూబ్ సర్ఫింగ్ నేర్చేసుకున్నాడు.. ఆ...

ఈ బుజ్జాయిని చూస్తున్నారా? వీడు మామూలోడు కాదు.. పుట్టుకతోనే మాస్టర్ బ్రైన్ తో పుట్టేశాడు.. నాలుగేళ్లొచ్చేసరికి యూట్యూబ్ సర్ఫింగ్ నేర్చేసుకున్నాడు.. ఆ తర్వాత నేరుగా బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టేశాడు.. ఆరేళ్లొచ్చేసరికీ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఓనరై కూర్చున్నాడు.. ఇప్పుడేకంగా ఫోర్బ్స్ జాబితాలో కూడా ప్లేస్ కొట్టేశాడు. .అఫ్ కోర్స్ ఇదంతా కుటుంబ సభ్యుల ఎంకరేజ్ మెంటే అనుకోండి. కాగా ర్యాన్ ఛానెల్ పేరుతో ఈ బుడ్డోడు నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్ కి ఏకంగా కోటి మంది సబ్ స్క్రైబర్లున్నారు.

చిన్న పిల్లలు యూ ట్యూబ్ చూడటం... మొబైల్ గేమ్స్ ఆడటం చేస్తుంటారు కానీ యూట్యూబ్ ఆసరాగా చేసుకుని 70 కోట్ల రూపాయలు సంపాదించడం అంటే మాటలా? అమెరికాకు చెందిన ఈ బుడుతడు ఇప్పుడు 2017 లో యూట్యూబ్ లోకే ఎక్కువ వేతనం సంపాదిస్తున్న స్టార్ గా ఎదిగాడు.. ఇంతకీ ర్యాన్ ఛానెల్ లో ఏముంటాయ్ అనుకుంటున్నారా? బుజ్జాయిలకు సంబంధించిన సమస్త వస్తువులూ ఉంటాయ్.. ఆట వస్తువుల నుంచి తినే వస్తువులు, ఇంటెలిజెన్స్ ను పెంచే చిన్న చిన్న గేమ్స్, వీడియోస్, ఇలా చాలా చాలా ఉంటాయ్.. ప్రతీ వీడియోలోను ర్యాన్ ఉత్సాహంగా, ఆ ఆట వస్తువును వినియోగిస్తూ.. కామెంట్రీ ఇస్తూ కనిపిస్తాడు.

అలాగే కొత్త కొత్త వెరైటీస్ క్యాండీస్ బాగున్నాయో లేదో రివ్యూలుంటాయ్. ర్యాన్ కుటుంబం ద్వారా నాలుగేళ్ల వయసులోనే ఈ ఛానెల్ పెట్టాడు. ర్యాన్ కి బొమ్మలంటే బాగా ఇష్టం.. టాయ్ రివ్యూస్ అవి కూడా ఓ చిన్నారి ఇస్తుండటం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ర్యాన్ రివ్యూ చూశాకే తల్లి తండ్రులు పిల్లలకు బొమ్మలు కొంటున్నారట.. బొమ్మ కార్లు, రైళ్లు, సూపర్ హీరోస్, డిస్నీ టాయ్స్, ప్లే డో, పిక్సర్ డిస్నీ కార్స్, డిస్నీ ప్లేన్స్, మాన్ స్టర్ ట్రాక్స్, ఇలా చిన్న పిల్లల ఆటవస్తువులపై రివ్యూలు, స్టార్ రేటింగులు ఇస్తుంటాడు. జెయింట్ ఎగ్ సర్ ప్రైజ్ పేరుతో ఓ బాక్సులో ఉన్న వంద టాయ్స్ పై ర్యాన్ ఇచ్చిన రివ్యూ అతగాడిని యూట్యూబ్ స్టార్ ని చేసింది. ఈ వీడియోని ఇప్పటి వరకూ 80 కోట్ల చూడటం గమనార్హం. అయితే ర్యాన్ ఛానెల్ ను ఇప్పటి వరకూ కోటి మంది సబ్ స్క్రయిబ్ చేయడంతో బుడతడు ఫోర్బ్స్ జాబితాకెక్కాడు..

Show Full Article
Print Article
Next Story
More Stories