ఫుట్‌పాత్‌ల‌పై ఉన్న అక్ర‌మ శాశ్వ‌త నిర్మాణాల కూల్చివేత

ఫుట్‌పాత్‌ల‌పై ఉన్న అక్ర‌మ శాశ్వ‌త నిర్మాణాల కూల్చివేత
x
Highlights

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫుట్ పాత్ ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి కొనసాగిస్తోంది. ఎన్నికల కార‌ణంగా కొన్ని రోజుల విరామం ఇచ్చిన అధికారులు ప‌లు ప్రాంతాల్లోని అక్ర‌మ నిర్మాణాల‌ను తొలిగిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు న‌డిచేందుకు వీలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామంటున్నారు అధికారులు.హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫుట్‌పాత్‌ల‌పై ఉన్న అక్ర‌మ శాశ్వ‌త నిర్మాణాల కూల్చివేతల‌ను జీహెచ్ఎంసీ కొన‌సాగిస్తుంది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫుట్ పాత్ ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి కొనసాగిస్తోంది. ఎన్నికల కార‌ణంగా కొన్ని రోజుల విరామం ఇచ్చిన అధికారులు ప‌లు ప్రాంతాల్లోని అక్ర‌మ నిర్మాణాల‌ను తొలిగిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు న‌డిచేందుకు వీలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామంటున్నారు అధికారులు.హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫుట్‌పాత్‌ల‌పై ఉన్న అక్ర‌మ శాశ్వ‌త నిర్మాణాల కూల్చివేతల‌ను జీహెచ్ఎంసీ కొన‌సాగిస్తుంది. అంబ‌ర్ పేట్ డివిజ‌న్ ప‌రిధిలో ప్ర‌దాన రోడ్ల‌లో 620 అక్ర‌మ‌ నిర్మాణాల‌ను కూల్చివేశారు. జీహెచ్ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్ డైరెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఈ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించారు. ఆరు మార్గాల్లో దాదాపు మూడు కిలోమీట‌ర్ల మేర 673 ఫుట్‌పాత్‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించిన అధికారులు వాటిని తొల‌గించాల‌ని నిర్ణయించారు.

ఈ మార్గంలో ఫుట్ పాత్ ల‌పై కి వ‌చ్చిన రెసిడెన్సియల్ క‌మర్షియ‌ల్ ఎస్టాబ్లిష్మెంట్లను పూర్తిగా తొల‌గించారు అధికారులు. గ‌తంలో చేప‌ట్టిన ప్ర‌త్యేక డ్రైవ్‌లో 12వేల ఆక్ర‌మ‌ణ‌ల‌ను జీహెచ్ఎంసీ తొల‌గించింది. జీహెచ్ఎంసీలోని ఎన్‌ఫోర్స్ మెంట్‌, టౌన్‌ప్లానింగ్‌, యు.సి.డి, ఇంజ‌నీరింగ్‌తో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డ‌ర్ పోలీస్ త‌దిత‌ర విభాగాల అధికారులు రంగంలో దిగారు. త‌గు సిబ్బంది, ప‌రికరాల‌తో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌ల‌ను చేప‌ట్టారు. ప్ర‌ధానంగా ర‌హ‌దారుల‌పై పాదాచారుల‌కు అడ్డంగా దుకాణ‌దారులు ఏర్పాటు చేసిన శాశ్వ‌త నిర్మాణాల‌ను అధికారులు కూల్చివేశారు. ప్ర‌జ‌ల‌కు న‌డ‌వ‌డానికి వీలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు చెబుతున్నారు. న‌గ‌రంలోని ఫుట్‌పాత్‌ల‌పై అక్ర‌మ నిర్మాణాలు తొల‌గించాల‌ని హైకోర్ట్ ప‌లు మార్లు జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీచేసింద‌ని గుర్తు చేస్తున్న అధికారులు జీహెచ్ఎంసీ చ‌ట్టం 504 సెక్ష‌న్ ప్ర‌కారం ఈ స్పెష‌ల్ డ్రైవ్‌ను చేపడుతున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories