అతడి ఆత్మహత్యను 2 వేల మంది లైవ్‌లో చూశారు

సమాజంలో మనిషి అనేవాడే మాయమైపోతున్నాడు. తోటి మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా దుర్మార్గంగా...
సమాజంలో మనిషి అనేవాడే మాయమైపోతున్నాడు. తోటి మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యే ఓ యువకుడు లైవ్‌లో ప్రాణాలు తీసుకుంటుంటే చోద్యం చూశారే తప్ప ఎవరూ కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. తర్వాత కొద్ది రోజులకే ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నా సెల్ఫీలు తీసుకున్నారే తప్ప.. ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. ఆ ఘటనల్ని మర్చిపోకముందే మరొక దారుణం బయటపడింది. ఈసారి గుర్గావ్‌లో ఓ వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రాణాలు తీసుకుంటుంటే సినిమా చూసినట్లు చూశారే తప్ప ఎవరూ కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు.
గురుగ్రామ్‌లోని పటౌడి గ్రామానికి చెందిన అమిత్ చౌహన్‌కు సోమవారం సాయంత్రం తన భార్యతో గొడవ జరిగింది. ఆమె 7 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న అమిత్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. దానిని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి అంటూ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న వారికి తెలిపాడు. తర్వాత గంటకు అతడు సీలింగ్ ఫ్యాన్‌కు ఊరి వేసుకున్నాడు. దాదాపు 2 వేల మంది ఈ వీడియోను చూసినప్పటికీ ఒక్కరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటననపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం పది గంటలకు తమకు సమాచారం అందిందని తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సరికే కుటుంబ సభ్యులు అతని అంత్యక్రిమలు పూర్తి చేశారని పేర్కొన్నారు. అమిత్ మరణంపై కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని.. దీనిపై విచారణ చేపట్టామని వెల్లడించారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Baby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMT