logo
సినిమా

700 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి కోలీవుడ్ సినిమా

700 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి కోలీవుడ్ సినిమా
X
Highlights

శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్‌గా అత్యంత విజువల్ వండర్ 2.0...

శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్‌గా అత్యంత విజువల్ వండర్ 2.0 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సూనామి సృష్టిస్తోంది. కేవలం ఒక్క హిందీలోనే వంద కోట్లలకి పైగా వసూళ్లు రాబట్టింది. ఎనిమిది రోజుల‌కి గాను 500 కోట్లు సాధించింది. కాగా ప‌దిహేను రోజుల‌లో 700 కోట్ల క్లబ్‌లో చేరింద‌ని స‌మాచారం. ఇంత పెద్ద వసూళ్ల పైసల వర్షం కూరిపించిన తొలి కోలీవుడ్ మూవీగా 2.0 రికార్డుల‌కి ఎక్కింద‌ని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2.0చిత్రానికి రూ 710.98 కోట్లు వసూళ్ళు చేయగా, తమిళనాడులో రూ 166.98 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ వెల్లడించారు.

Next Story