ఇతర కులం యువకుడితో యువతి పారిపోయేందుకు యత్నించిందని...

ఓ యువతి ఇతర కులం అబ్బాయిని ప్రేమించి అతనితో లేచిపోయేందుకు యత్నించిన ఓ యువతిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి...
ఓ యువతి ఇతర కులం అబ్బాయిని ప్రేమించి అతనితో లేచిపోయేందుకు యత్నించిన ఓ యువతిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని జోగియా మారన్ గ్రామంలో సంచలనం రేపింది. వివరాలు.. జగియా మారన్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఫరీద్ అన్సారీ కూతురు (18) పొరుగూరుకు చెందిన రూపేష్ కుమార్‌ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. యువతి ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే తిరస్కరించారు. పెళ్లి చేసుకోవాలని భావించిన యువతి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అతడితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన గ్రామస్థులు ఆమెను పట్టుకుని పంచాయతీ నిర్వహించారు. ఆమెను చెట్టుకు కట్టేసి చావబాదారు. వేరే కులం యువకుడితో వెళ్లేందుకు ప్రయత్నించి గ్రామం పరువు తీసిందని ఆరోపించారు. చెట్టుకు కట్టేసి ఐదు గంటల పాటు హింసించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్పృహ కోల్పోయిన యువతిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
Telangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMTఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్...
9 Aug 2022 8:30 AM GMTభద్రాద్రి జిల్లా పాల్వంచలో దొంగల హల్చల్
9 Aug 2022 8:29 AM GMT