వ్యవసాయ దారులకు ఢిగ్రీ...రైతులకు డిగ్రీ పట్టాలిచ్చేందుకు ప్రత్యేక కోర్సులు

farmers
x
farmers
Highlights

చేసేది హోటల్లో క్లీనింగ్ అయినా మోసేది పార్సిల్ అయినా ఏ ఉద్యోగం చేయడానికి అర్హత ఉండాలి ఆ అర్హత ఉందని తెలిపేదే డిగ్రీపట్టా మరి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ది చెందక మునుపే పంచభూతాల గమనాలను అంచనా వేస్తూ వాటిని అనుసరిస్తూ భూమిని మదించి పంటను పండించి పది మంది ఆకలి తీర్చే రైతుకు ఏ డిగ్రీ ఉంది వారి కష్టాన్ని కొలిచే క్వాలిఫికేషన్ ఉండదా.?

వ్యవసాయం చేయడానికి ఎంతో నైపుణ్యం ఉండాలి పొలం దున్నడం మొదలు విత్తనాలు వేయడం, కోతలు కోయడం, పటంట చేతికి వచ్చాక వాటిని భద్రపరిచి విక్రయించే వరకూ ఎంతో జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరి ఇంత విజ్ఞానం, తెలివి ఉన్న రైతులకు క్వాలిఫికేషన్ మాత్రం ఎందుకు ఉండదు సరిగ్గా ఈ ఆలోచనే ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది చిత్తూరు జిల్లాలో రైతులకు డిగ్రీలు ఇచ్చే కార్యక్రమానికి మూలంగా నిలవబోతోంది.

వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్శిటీ, రైతుల కోసం ప్రత్యేక కోర్సులు డిజైన్ చేయడానికి ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. దేశంలోనే ప్రథమంగా ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో మొదలు కాబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది.

ఎకరాల కొద్దీ పొలాలు ఉన్నా చిన్నపాటి ఉద్యోగం కోసం వెతుక్కుని వెళ్ళిన వారిలో కొందరు ఇప్పుడిప్పుడే వ్యవసాయంలోని మాధుర్యాన్ని తెలుసుకుని తిరుగుముఖం పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే యువతను పొలం పనుల పట్ల మళ్ళించడానికి పొలం పనులు చేసినా ఓ డిగ్రీ వస్తుందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ పియస్ ప్రద్యమ్న. అధిక దిగుబడులు ఉత్పత్తి చేస్తున్న వారిని గెస్ట్ లెక్చరర్ గా పిలిచి సంబంధింత విద్యార్థులకు పాఠాలు చెప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ సరికొత్త ఆలోచన రైతులకు మరింత ప్రోత్సాహకాన్ని అందిస్తుందని అధికారులు బావిస్తున్నారు. ఇక అగ్రికల్చరల్ డిగ్రీ లేదా డిప్లొమా, పండ్లు, కూరగాయలైతే హార్టికల్చర్ డిగ్రీ లేదా డిప్లొమా పాలు, పాల ఉత్పత్తులు, డైరీ అయితే వెటర్నరీ వర్శిటీల నుంచి డిగ్రీ లేదా డిప్లొమాలు ఇవ్వడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. మొత్తానికి నిత్యం సవాళ్లు ఎదుర్కునే రైతులు హలంతో పాటు కలం పట్టి డిగ్రీలు సంపాదించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.Degree Certificate for Farmers

Show Full Article
Print Article
Next Story
More Stories