తెలంగాణలో పోలీస్ ఉద్యోగార్ధులకు ప్రభుత్వం తీపి కబురు

తెలంగాణలో పోలీస్ ఉద్యోగార్ధులకు ప్రభుత్వం తీపి కబురు
x
Highlights

తెలంగాణలో పోలీస్ ఉద్యోగార్ధులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోంశాఖలో 14,177 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ...

తెలంగాణలో పోలీస్ ఉద్యోగార్ధులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోంశాఖలో 14,177 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సివిల్ కానిస్టేబుల్ -5002, స్పెషల్ కానిస్టేబుల్ -3372, ఏఆర్ కానిస్టేబుల్ - 2283, ఎస్‌ఐ సివిల్ - 710, ఎస్‌ఐ ఏఆర్ - 275, ఎస్‌ఐ స్పెషల్ పోలీసు - 191, కమ్యూనికేషన్ ఎస్‌ఐ -29, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ - 142, సీసీఎల్ కానిస్టేబుల్ - 53, సీటీవో కానిస్టేబుల్ -89, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ -26 పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని విభాగాల్లో మొత్తం ఎస్‌ఐ పోస్టులు -1210, కానిస్టేబుల్స్ - 12,941, ఏఎస్‌ఐ పోస్టులు - 26 ఉన్నాయి. ఈ ఖాళీలను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనుంది తెలంగాణ సర్కార్.


Show Full Article
Print Article
Next Story
More Stories