logo
జాతీయం

ఒడిషా‌లో ఏనుగుల గుంపు బీభత్సం

ఒడిషా‌లో ఏనుగుల గుంపు బీభత్సం
X
Highlights

ఏనుగుల గుంపు ఒక చోట చేరిందంటే ఇక అంతే ఆ ఏరియా మొత్తం చిత్తు చిత్తవ్వాల్సిందే. అలాంటి ఏనుగుల గుంపు ఒడిషాలో ...

ఏనుగుల గుంపు ఒక చోట చేరిందంటే ఇక అంతే ఆ ఏరియా మొత్తం చిత్తు చిత్తవ్వాల్సిందే. అలాంటి ఏనుగుల గుంపు ఒడిషాలో బీభత్సం సృష్టించింది. ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాయి. ఏనుగుల గుంపును చూసిన జనం తీవ్ర భయాందోళనతో హడలిపోయారు. ఒడిషాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అటవీ ప్రాంతం నుంచి గట్టిగా అరుస్తూ గ్రామాల్లోకి చొరబడిన ఏనుగుల గుంపు నానా హంగామా సృష్టించాయి. ఒకటి కాదు రెండు ఏకంగా 120 గజరాజులు గ్రామాల్లోకి చొరబడ్డాయి. అక్కడితో ఆగకుండా నానా హంగామా చేశాయి. ఇళ్ల ముందున్న వస్తువులను చిందర వందర చేసేశాయి. అంతేకాక పంటలు, ఇళ్లను స‌ర్వనాశ‌నం చేశాయి ఏనుగులు.

పరుగు పరుగున మయూర్ భంజ్ జిల్లాలోని పలు గ్రామాలకు వచ్చిన ఏనుగుల మందను చూసి స్థానికులు బిత్తరపోయారు. సడెన్‌గా జనావాసాల్లోకి ఏనుగుల గుంపు రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. వెంటనే ఏనుగులు చేస్తున్న హడావుడిని స్ధానికులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. తరుచూ ఇలాగే ఏనుగులు తమ గ్రామంలోకి చొరబడి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని కోరారు.

Next Story