9 లక్షలు దాటినా పన్ను లేదు.. అయితే ఇలా చేయాలి..

9 లక్షలు దాటినా పన్ను లేదు.. అయితే ఇలా చేయాలి..
x
Highlights

ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం వేతన జీవులను ఆకట్టుకునే విధంగా మినహాయింపులు ప్రకటించింది. ఆదాయపు పన్ను పరిమితిని 5లక్షల రూపాయలకు...

ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం వేతన జీవులను ఆకట్టుకునే విధంగా మినహాయింపులు ప్రకటించింది. ఆదాయపు పన్ను పరిమితిని 5లక్షల రూపాయలకు పెంచింది. వార్షిక ఆదాయం 5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి కూడా 40 వేల నుంచి 50 వేలకు పెంచారు. పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిఅలావుంటే కేంద్రం ప్రకటించిన మినహాయింపులు సరిగ్గా వినియోగించుకుంటే మొత్తం తొమ్మిది లక్షలు దాటినా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు..

గతంలో రూ.3.50 లక్షలలోపు పన్ను ఆదాయంపై రూ.2,500 పన్ను రిబేటు ఉండేది. ఇప్పడు ఈ రిబేటును రూ.5 లక్షల పన్ను ఆదాయంపై రూ.12,500కు పెంచారు. అదనంగా సెక్షన్‌ 80–సీ కింద లభించే రూ.1.50 లక్షలు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000, గృహ రుణానికి చెల్లించే వడ్డీ రూ.2,00,000, ఎన్‌పీఎస్‌కు చెల్లించే రూ.50 వేలు పన్ను మినహాయింపులను వినియోగించుకున్నట్టయితే రూ.10 లక్షల వార్షికాదాయం వచ్చేవారు కూడా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే పన్ను ఆదాయం (టాక్సబుల్‌ ఇన్‌కమ్‌) రూ.5,00,000 కన్నా ఒక్క రూపాయి దాటినా ఈ రిబేటు వర్తించదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories