ఇండియన్ మార్కెట్ లో రెడ్‌మి నోట్‌ 8 కొత్త వేరియంట్‌

ఇండియన్ మార్కెట్ లో రెడ్‌మి నోట్‌ 8 కొత్త వేరియంట్‌
x
Redmi Note 8
Highlights

స్మార్ట్ ఫోన్ ప్రియులక కోసం రెడ్‌మి మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. షావోమి రెడ్‌మి నోట్ 8లో కాస్మిక్‌ పర్పుల్‌ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

స్మార్ట్ ఫోన్ ప్రియులక కోసం రెడ్‌మి మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. షావోమి రెడ్‌మి నోట్ 8లో కాస్మిక్‌ పర్పుల్‌ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకున్న వారు అమెజాన్‌, ఎంఐ.కాం ద్వారా తీసుకోవచ్చు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు మాత్రమే ఈ ఫోన్ అమెజాన్‌, ఎంఐ.కాం లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కొత్త కాస్మిక్ పర్పుల్ కలర్ మాత్రమే కాకుండా ఈ ఫోన్లో మరెన్నో కలర్లను కూడా మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు.

ఈ ఫోన్ ల ధరల విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ గల ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. ఇక 6జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ గల ఫోన్ ధర రూ. 12,999గా మార్కెట్లో ఉంది.

ఇక రెడ్‌మి నోట్ 8 ఫోన్ ఫీచర్లను చుసుకుంటే ఇది 6.39 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లే కలిగిఉంది. 1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్‌, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 సాక్‌ లు ఉన్నాయి. కెమెరా చూసుకుంటే 48+8+2+2 ఎంపీ క్వాడ్‌ కెమెరా, 13 ఎంపీ సెల్పీ కెమెరా కలిగిఉంది. ఇక బ్యాట్రీ బ్యాకప్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిఉంది.

ఇక ఆలస్యం దేనికి ఇన్ని మంచి ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్ సొంతం చేసుకోండిక.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories