భారత మార్కెట్ లోకి ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్

భారత మార్కెట్ లోకి ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్
x
ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్
Highlights

పాత సంవత్సరానికి బైబై చెబుతూ మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పబోతున్నాం.

పాత సంవత్సరానికి బైబై చెబుతూ మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న సమయంలో కొన్ని కంపెనీలు వారి కస్టమర్లను సంతోషపెట్టడానికి కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ లో మంచి ఆఫర్లను, నూతన మోడల్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగానే టీవీ కంపెనీలలో బ్రాండ్ గా నిలిచిన ఒనిడా కస్టమర్లకోసం ఒక మంచి వార్తను తీసుకొచ్చింది.

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ టీవీ తయారీ సంస్థ ఒనిడా రెండూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. నూతనంగా ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ పేరిట కొత్త స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఈ టీవీలు దాదాపుగా 32 నుంచి 43 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ టీవీలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అవి అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్‌వేర్ ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి. ఇక ఈ టీవీ రిజల్యూషన్ విషయానికొస్తే 32 ఇంచుల టీవీ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇదే విధంగా 43 ఇంచుల టీవీ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను వినయోగదారుల కోసం అందిస్తుంది. అంతేకాదు ఈ టీవీల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ తదితర స్ట్రీమింగ్ యాప్స్‌ను కూడా ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.

ధరలు.

32 ఇంచుల టీవీ ధర రూ.12,999

43 ఇంచుల టీవీ ధర రూ.21,999

ఈ టీవీలను డిసెంబర్ 20వ తేదీ నుంచి అమెజాన్‌లో విక్రయించడానికి సన్నాహాలు సిద్దం చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం నూతన సంవత్సంలో కొత్త టీవీని కొనుగోలు చేసి ఆనందించండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories