హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..వాట్సాప్ లోనే ఎన్నో రకాల సేవలు!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..వాట్సాప్ లోనే ఎన్నో రకాల సేవలు!
x
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లోగో
Highlights

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటి నుంచైనా, ఆఫీస్ నుంచైనా మీకు కావలసిన బేసిక్ బ్యాంకింగ్...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటి నుంచైనా, ఆఫీస్ నుంచైనా మీకు కావలసిన బేసిక్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఇందుకోసం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వాట్సప్ ద్వారా ఖాతాదారులు వారి అకౌంట్ లో ఉన్న నగదును చెక్ చేసుకోవడం నుంచి క్రెడిట్ కార్డుపై అందుబాటులో ఉన్న లిమిట్ వరకు చూసుకోవచ్చు.

సేవింగ్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అంతు కాదు చెక్ బుక్ కావాలనుకునే వారు కొత్త చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఈ తరహా సేవలపై ఎలాంటి చార్జీలు పడవు. అయితే వాట్సాప్ వినియోగం వల్ల డేటా మాత్రం ఖర్చవుతుంది. ఈ సర్వీసులు ఖాతాదారులకు 24గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఏ సమయంలోనైనా ఈ వాట్సప్ బ్యాంకింగ్ సర్వీసులను ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. ఈ సేవలను వినియోగించాలనుకునే వారు 7065970659కు ఎస్‌యూబీ అని టైప్ చేసి ఎప్ఎంఎస్ పంపాలి. లేదంటే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. లేదా హాయ్ అని మెసేజ్ పంపండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories