Nomine: బ్యాంకు ఖాతాలు, ఇన్సూరెన్స్‌లలో నామినీ పేరుని చేర్చారా.. లేదంటే చాలా నష్టపోతారు..!

Do you Include Nominees Name in Bank Accounts and Insurances Otherwise you Will Lose a lot
x

Nomine: బ్యాంకు ఖాతాలు, ఇన్సూరెన్స్‌లలో నామినీ పేరుని చేర్చారా.. లేదంటే చాలా నష్టపోతారు..!

Highlights

Nomine: మీరు మీ పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దాలంటే తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలు , బీమా, స్టాక్‌లు, ఇతర ఆస్తులకి నామినీ పేరుని చేర్చాలి.

Nomine: మీరు మీ పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దాలంటే తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలు , బీమా, స్టాక్‌లు, ఇతర ఆస్తులకి నామినీ పేరుని చేర్చాలి. దీనివల్ల మీ తదనంతరం కుటుంబ సభ్యులు ఆర్థిక అవసరాల కోసం ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఒక వ్యక్తి సంపదను నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. ఆ వ్యక్తి ఆస్తిని తన కుటుంబానికి లేదా వారసులకు అప్పగిస్తాడు. అయితే మీ ఆస్తి సరైన చేతుల్లోకి వెళ్లిందో లేదో ఎలా నిర్ధారిస్తారు. కాబట్టి మీ ఆస్తికి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీగా చేర్చుకోవచ్చు.

నామినీని పేరుని యాడ్‌ చేసినప్పుడు బ్యాంక్ డిపాజిట్లు, ఎఫ్‌డిలు, ఆర్‌డిలు, పిపిఎఫ్ ఫండ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లలో పెట్టుబడి పెట్టిన మొత్తం మీ మరణం తర్వాత నామినీకి అందుతుంది. తప్పు నామినీని ఎంచుకోవడం వల్ల మీ ఆస్తి, డబ్బు రెండూ ప్రమాదంలో పడవచ్చు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత నామినీ అతని ఆస్తికి సంరక్షకుడు. అన్ని చట్టపరమైన హక్కులను పొందుతాడు.

ఒక వ్యక్తి FD, సేవింగ్స్ ఖాతా, PPF, మ్యూచువల్ ఫండ్, జీవిత బీమా కోసం వేర్వేరు వ్యక్తులను నామినీగా చేయవచ్చు. ఎందుకంటే బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్లాన్‌లు ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా చేసే అవకాశాన్ని అందిస్తాయి. దీంతో పాటు షేర్ల పెట్టుబడిలో ఒకరి కంటే ఎక్కువ మందిని నామినేట్ చేయవచ్చు. అయితే బ్యాంకు ఖాతాలో ఒక వ్యక్తి మాత్రమే నామినీగా ఉంటాడు.

ఎవరు నామినీ కావచ్చు?

మీ ఆస్తికి నామినీ మీ భార్య, భర్త, స్నేహితుడు లేదా బంధువు కావచ్చు. అయితే నామినీగా చేసిన వ్యక్తికి ఆస్తికి సంబంధించిన చట్టపరమైన హక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నామినీకి చట్టపరమైన హక్కులు లేనప్పుడు అతను ఆస్తికి సంరక్షకునిగా మాత్రమే వ్యవహరిస్తాడు. బ్యాంక్ ఖాతా మినహా ఇతర పెట్టుబడి ప్రణాళికలలో నామినీగా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది లేదా విభిన్న వ్యక్తులను నామినీగా చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్‌లో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories