పెరిగిన వంట గ్యాస్ ధరలు

పెరిగిన వంట గ్యాస్ ధరలు
x
Highlights

"ఏం కొనేటట్టు లేదు ఏం తినే తట్టులేదు" అన్న పాట ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలకు సరిగ్గా వర్తిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ వస్తువు కొందామన్నా ధరలు...

"ఏం కొనేటట్టు లేదు ఏం తినే తట్టులేదు" అన్న పాట ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలకు సరిగ్గా వర్తిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ వస్తువు కొందామన్నా ధరలు కొండెక్కుతున్నాయి. ఇప్పుడు తాజాగా గ్యాస్ ధరలు కుడా పెరగడంతో మధ్య తరగతి కుటుంబాలకు షాక్ తగిలినట్టయింది. గతంతో పోల్చుకుంటే సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా రూ.76 వరకు పెరిగింది. పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు నవంబర్ 1, 2019 నుంచే అమలులో వస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన పెరిగిన ధరల జాబితా ప్రకారం 14.2 కేజీల ఇండేన్ గ్యాస్ నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు

ఢిల్లీ - రూ.681.50,

కోల్‌కతా -రూ.706

ముంబై -రూ.651

చెన్నై - రూ.696

అక్టోబర్ నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ.15 మేర పెరిగింది. సెప్టెంబర్ నెలలో రూ.15.5 పైకి కదిలింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా ఒకటో తారీఖున పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ ఏడాది సిలిండర్ ధరలు పెరగడం ఇది వరుసగా మూడో సారి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories