తెలుగురాష్ట్రాలకు భారీ వర్షసూచన

తెలుగురాష్ట్రాలకు భారీ వర్షసూచన
x
Highlights

♦ పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ♦ కోస్తాకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు ♦ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని.. ♦ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ, తెలంగాణాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వానలు కురుస్తాయని చెప్పారు. తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

కోస్తాకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారి కోస్తా వైపు పయనించనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి.

ఇటు గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటు కొన్ని జిల్లాలో భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉండటంతో ప్రభావిత జిల్లాల అధికారుల్ని విపత్తుశాఖ అప్రమత్తం చేసింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని అంచనాతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కాంచీపురం, పుదుకోట్టై, నాగపట్నం, కడలూరులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. మరో మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోయంబత్తూరులో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భవానీసాగర్‌ డ్యామ్‌ పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నీలగిరి, సేలం, నామక్కల్‌, దిండిగల్‌, రామనాథపురం జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

,


Show Full Article
Print Article
More On
Next Story
More Stories