భారత మార్కెట్ లోకి స్కోడా కరోఖ్ కారు... లాంచ్ ఎప్పుడంటే?

భారత మార్కెట్ లోకి స్కోడా కరోఖ్ కారు... లాంచ్ ఎప్పుడంటే?
x
Skoda Karoq
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే కొన్ని సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేయడాన్ని వాయిదా వేసుకున్నాయి.

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే కొన్ని సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేయడాన్ని వాయిదా వేసుకున్నాయి. ఈ జాబితాలోనే ప్రముఖ ఆటోసంస్థలు అద్భుతమైన ఫీచర్స్ తో కొత్తగా డిజైన్ చేసిన కార్ల లాంచ్ ను వాయిదా వేసుకున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత భారత మార్కెట్లో వీటిని విడుదల చేయనున్నాయి.

ఈ వరుసలో వాహనాల డిజైనింగ్ లో బ్రాండ్ గా పేరు పొందిన ప్రముఖ చెక్ వాహన సంస్థ స్కోడా కూడా ఉంది. అయితే ఈ కంపెనీ స్కోడా కరోఖ్ మోడల్ ను ఇప్పటికే ఏప్రిల్ నెలలో లాంచ్ చేయాల్సి ఉండగా పరిస్థితులు అనుకూలించక పోవడంతో దాన్ని వాయిదా వేసారు. కాగా కంప్లిట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా అందుబాటులోకి వస్తున్న ఈ వాహనాన్ని మే 6న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నారని సమాచారం.

ఇక ఏప్రిల్ నెలలోనే దీన్ని లాంచ్ చేస్తున్నారని సమాచారం ఉండడంతో చాలా మంది ఈ కార్ ను తమ సొంతం చేసుకోవడానికి మార్చి 17 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ బుకింగ్ లో ముందస్తుగానే 50 వేల రూపాయల బుకింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

ఇంజిన్..

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టంతో పనిచేసే స్కోడా కరోఖ్ స్పోర్ట్ మోడల్ కార్ పవర్ ను అన్ని చక్రాలకు చేరవేస్తుంది. ఇది 1.5-లీటర్ టర్బోఛార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండి. ఇది 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తూ, 148 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్ తో నడుస్తుంది. ఈ కార్ కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లతో పనిచేస్తుంది. ఈ కార్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9 సెకండ్లలోనే చేరుకుంటుంది. అంటే గంటలకు గరిష్టంగా 202 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

డిజైన్..

ఇక ఈ కార్ డిజైన్ ని చూసుకుంటే ఇంచుమించు స్కోడా కోడియాక్ మాదిరిగానే ఉండనుంది. 12-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పానోరామిక్ సన్ రూఫ్, 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, బటర్ ఫ్లై గ్రిల్, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ డిస్ ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 9 ఎయిర్ బ్యాగులు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ లాంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అంతే కాక ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ఈఎస్సీ, బ్రేక్ అసిస్ట్ లాంటి ఫీచర్లను ఈ కార్ కలిగి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories