స్పీకర్ కు ఎంపీ ఫిర్యాదు..చంద్రబాబు డైరక్షన్ అంటున్న వైసీపీ వర్గాలు!

స్పీకర్ కు ఎంపీ ఫిర్యాదు..చంద్రబాబు డైరక్షన్ అంటున్న వైసీపీ వర్గాలు!
x
Highlights

తనకు నియోజకవర్గంలో ప్రాణాహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు లేఖ రాశారు. ఏపీ...

తనకు నియోజకవర్గంలో ప్రాణాహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం తప్పులను బహిరంగంగా ఎత్తిచూపితే ఎమ్మెల్యేలు తనపై కక్షగట్టారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎంపీ రఘు రామకృష్ణం రాజు ఫిర్యాదుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల వైపీసీ ఏడాది పాలనపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. పలుచోట్ల రఘురామకృష్ణంరాజు దిష్షిబొమ్మలను వైసీపీ శ్రేణులు దహనం చేశారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణాహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఎంపీ రఘు రామకృష్ణ రాజు లేఖ రాశారు.

శ్రీవారి భూముల అమ్మకం , ఇసుక వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తప్పులను నేను బహిరంగంగా ఎత్తిచూపే ప్రయత్నం చేశాను, అప్పట్నుంచి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు అలజడి సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. నా వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గానికి వెళ్ళాలంటే కేంద్ర బలగాల రక్షణ కావాలని లోక్ సభ స్పీకర్ కు ఎంపీ రఘు రామకృష్ణ రాజు లేఖ రాశారు.

ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఫిర్యాదుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబే రఘు రామకృష్ణ రాజు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే జిల్లాలో నలుగురు ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తనకు అసభ్య పదజాలంతో దూషించి, దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన వారిపై ఆచంట, ఉండి, తాడేపల్లిగూడెం, ఆకివీడు ఎస్ ఐలు కేసులు నమోదు చేయలేదని, వారిపై చర్యలు తీసుకోని, ప్రత్యేక అధికారిని నియమించాలని లేఖలో కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories