ఎన్జీవోలకు ఏపీ ప్రభుత్వం షాక్

ఎన్జీవోలకు ఏపీ ప్రభుత్వం షాక్
x
Highlights

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సిపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీవో)లకు షాకిచ్చింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సిపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీవో)లకు షాకిచ్చింది. ఏపీ ఎన్జీవో సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు పంపింది. 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు పలువురు మంత్రులు హాజరైన తిరుపతిలో ఎపిఎన్జిఓ సమావేశమైంది. 2001లో ఇచ్చిన జీవో ప్రకారం 264లోని రూల్‌ 3(2), (ఏ)(4) ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా సమావేశానికి హాజరయ్యారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడికి తాజాగా ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి లేఖ రాశారు.

ఏపీ ఎన్జీవో బైలాస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయలేదని.. ఎన్జీవోల సంఖ్యను కూడా ఇంత వరకు ప్రభుత్వానికి చెప్పలేదని అందులో పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవోలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆ లేఖలో వెల్లడించారు.. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌కు ప్రభుత్వమిచ్చిన స్థలాలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసు పంపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories