అమెరికాలో సీఎం జగన్ షెడ్యూల్‌ ఇదే..

అమెరికాలో సీఎం జగన్  షెడ్యూల్‌ ఇదే..
x
Highlights

వారం రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. సీఎంగా ఇదే తొలి పర్యటన కావడంతో స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రుల భారీ ఏర్పాట్లు చేశారు. వారం రోజులపాటు ఆయన అక్కడే వ్యక్తిగత పనులతో బిజీబిజీగా గడపనున్నారు.

వారం రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. సీఎంగా ఇదే తొలి పర్యటన కావడంతో స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రుల భారీ ఏర్పాట్లు చేశారు. వారం రోజులపాటు ఆయన అక్కడే వ్యక్తిగత పనులతో బిజీబిజీగా గడపనున్నారు. తిరిగి 24వ తేదీకి అమరావతికి చేరుకుంటారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి యూఎస్‌కు బయలుదేరి వెళ్లారు.

ఆగస్టు 16 ఉదయం 8:30 గంటలకు జగన్ వాషింగ్టన్ డీసీ చేరనున్నారు. అమెరికాలో భారత రాయబారితో భేటీ అవుతారు. అనంతరం ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం అమెరికాలోని భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. 17న మధ్యాహ్నం 2 గంటలకు డల్లాస్‌ చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో నార్త్‌ అమెరికా తెలుగు కమ్యూనిటీ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం అయ్యాక తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అటు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఇక 18వ తేదీన వాషింగ్టన్ డీసీలో వ్యాపార సంస్థల ప్రతినిధులతో జగన్ ముఖాముఖి చర్చలు జరుపుతారు. 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనులపై ఆయన పర్యటించనున్నారు. తన చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద కుమార్తె హర్ష లండన్‌లో చదువుతుండగా.. చిన్న కుమార్తెను అమెరికాలో చేర్పిస్తున్నారు. అలాగే, 22న మధ్యాహ్నం షికాగోలో మరికొంత మంది ప్రతినిధులను కలవనున్న జగన్.. అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఏపీకి తిరుగు ప్రయాణమవుతారు. ఈ నెల 24కి ఆయన అమరావతికి చేరుకుంటారు. తన పర్యటనలో 3 రోజులు వ్యకిగత పనులు ఉండటంతో ప్రభుత్వం నుంచి సీఎం జగన్ ఎలాంటి ఖర్చులు తీసుకోవడం లేదని.. తన ఖర్చులను తానే భరిస్తారని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories