నేడు ప్రచార సభ రద్దు.. ఖరారైన జగన్ షెడ్యూల్..

నేడు ప్రచార సభ రద్దు.. ఖరారైన జగన్ షెడ్యూల్..
x
Highlights

మాజీ మంత్రి, వైయస్ఆర్ సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన కారణంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తొలి రోజు ఎన్నికల ప్రచార...

మాజీ మంత్రి, వైయస్ఆర్ సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన కారణంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తొలి రోజు ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారు. ఈ నెల 16న ఇడుపులపాయలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి, ఆ తర్వాత పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అక్కడి నుంచి గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాల్సి ఉంది. అయితే వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ఆయన హైదరాబాద్‌ నుంచి పులివెందులకు వెళ్లారు. వివేకా అంత్యక్రియలకు హాజరుకానున్న జగన్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

కాగా ఆదివారం (మార్చి17) నుంచి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు నర్సీపట్నం, 12 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, సాయంత్రం 2.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగే బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. అలాగే సోమవారం ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, 2.30 గంటలకు వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచార సభలు జరుగుతాయని తలశిల రఘురాం వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories