త్వరలో కొవిడ్ 19 మొట్టమొదటి టెస్ట్ కిట్ ను లాంచ్ చేయనున్న జగన్

త్వరలో కొవిడ్ 19 మొట్టమొదటి టెస్ట్ కిట్ ను లాంచ్ చేయనున్న జగన్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో తయారైన కొవిడ్ 19 మొట్టమొదటి టెస్ట్ కిట్ ను ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేయబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తయారైన కొవిడ్ 19 మొట్టమొదటి టెస్ట్ కిట్ ను ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేయబోతున్నారు. రెండురోజుల్లో కరోనా టెస్ట్ కిట్ ను ఆయన ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. కమర్షియల్ ప్రొడక్షన్ ను వచ్చే వారం నుంచి ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. వైజాగ్ లోని మెడ్ టెక్ జోన్ లో వెంటిలేటర్లతో సహా టెస్ట్ కిట్లను తయారు చేస్తున్నారు.

టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు తయారుచేసే కంపెనీలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.30కోట్లను రిలీజ్ చేసింది. కేంద్రం ఇచ్చిన రూ.8కోట్లకు ఇది అదనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన సాంకేతికత, మార్గనిర్దేశకాల ఆధారంగా టెస్టింగ్, డయాగ్నొసిస్ ఎక్విప్ మెంట్ ను కంపెనీలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే థర్మల్ స్కానర్స్ తయారీని కంపెనీలు ప్రారంభించాయి

దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కు తగ్గట్టుగా.. టెస్టింగ్ ఎక్విప్ మెంట్ ను తయారుచేయడంలో పేరున్న కంపెనీలు తలమునకలై ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 3500 వెంటిలేటర్ల ఆర్డర్ ను వైజాగ్ లోని AMTZ కంపెనీకి ఇప్పటికే ఇచ్చింది కేంద్రం. ఏప్రిల్ లో ఈ కంపెనీ 3వేల వెంటిలేటర్లను.. మే నెల నుంచి నెలకు ఆరువేల వెంటిలేటర్లను ఈ కంపెనీ ఇవ్వనుంది. వారానికి పదివేల కరోనా డయాగ్నొసిస్ కిట్స్ ను .. ఈ కంపెనీ అందివ్వనుంది. మే నెల నుంచి.. వారానికి 25వేల కరోనా టెస్టింగ్ కిట్స్ కు తమ ప్రొడక్షన్ ను పెంచుకోనుంది ఈ కంపెనీ.

సంక్షోభం కారణంగా డిమాండ్ పెరగడంతో.. కంపెనీలనుంచి టెస్టింగ్ కిట్స్ తయారీకి అప్రూవల్ ను మినహాయించింది కేంద్రప్రభుత్వం. కంపెనీలు తయారుచేసిన అత్యవసర మందులు, టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్లను ICMR వెరిఫికేషన్ ముగిశాక మార్కెట్లోకి వస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories