దిశ యాప్‌ ఫస్ట్ విక్టరీ.. పోలీసులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం జగన్ !

దిశ యాప్‌ ఫస్ట్ విక్టరీ.. పోలీసులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం జగన్ !
x
Highlights

అమ్మాయిలకు రక్షణగా తీసుకొచ్చిన దిశ చట్టం తొలి విజయాన్ని నమోదు చేసింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆకతాయిని అరెస్ట్...

అమ్మాయిలకు రక్షణగా తీసుకొచ్చిన దిశ చట్టం తొలి విజయాన్ని నమోదు చేసింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆకతాయిని అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామయున 4 గంటలా 21 నిమిషాల సమయంలో ఓ మహిళ SOS అనే యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో వెంటనే స్పందించిన ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేవలం నిమిషాల వ్యవధిలోనే చేరుకుని వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

చిమ్మ చీకట్లలో ప్రయాణిస్తున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఇంత త్వరగా స్పందించి ఆకతాయిని అరెస్ట్ చేసిన పోలీసులను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. దిశ యాక్ట్ ఉద్దేశ్యాన్ని, ఫలితాన్ని చూపించినందుకు అభినందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories