వరద బాధితులందరికి ఇళ్లు కట్టిస్తాం : సీఎం జగన్

వరద బాధితులందరికి ఇళ్లు కట్టిస్తాం : సీఎం జగన్
x
Highlights

సీఎం జగన్ కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. వరద ప్రభావం, సహాయ చర్యలు,...

సీఎం జగన్ కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో వరద పరిస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవుడి దయ వల్ల రాయలసీమలో వర్షాలు బాగా కురిశాయన్నారు. భారీ వర్షాల వల్ల ఆర్ అండ్ బీ రోడ్లు, పీఆర్ రోడ్లు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో 784 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. 31వేల హెక్టార్లలో పంట నష్టం, 2వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు.

గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు జగన్ తెలిపారు. భవిష్యత్‌లో రాయలసీమలోని ప్రతి డ్యామును నీటితో నింపుతామన్నారు. నంద్యాల చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సాధారణంగా ఇచ్చే వరద సాయం కంటే అదనంగా 2వేల రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. వరద బాధితులందరికి ఇళ్లు కట్టిస్తామని జగన్ స్పష‌్టం చేశారు. అంతకుముందు జగన్ కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories