Top
logo

దివంగత సీఎం వైఎస్ఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి

దివంగత సీఎం వైఎస్ఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి
Highlights

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కుటుంబ సభ్యులు శోకాతప్త హృదయాలతో నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని...

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కుటుంబ సభ్యులు శోకాతప్త హృదయాలతో నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో పాటు వైసీపీ సీనియర్ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సమాధి దగ్గర సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. వైఎస్ఆర్ పదో వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు, వైసీపీ కార్యకర్తలు నేతలు నివాళులు అర్పించారు. వైఎస్ఆర్‌తో తమ అనుబంధాన్ని తలుచుకుంటూ పలువురు కన్నీరు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ ఘాట్‌‌కు చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం జగన్ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్‌ఆర్ వైఎస్ఆర్ అమర్ హై అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Next Story