ఇదే నా చివరి సెల్ఫీ అన్న యువకుడు.. ఆ మాటలే నిజమయ్యాయి

ఇదే నా చివరి సెల్ఫీ అన్న యువకుడు.. ఆ మాటలే నిజమయ్యాయి
x
వినోద్
Highlights

ఒరేయ్ బావా... చూడు ఇదే నా చివరి సెల్ఫీ... ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు కదా... అందుకే ఇది చివరిది... అంటూ సరదాగా చిత్రీకరించుకున్న టిక్ టాక్ వీడియోలోని...

ఒరేయ్ బావా... చూడు ఇదే నా చివరి సెల్ఫీ... ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు కదా... అందుకే ఇది చివరిది... అంటూ సరదాగా చిత్రీకరించుకున్న టిక్ టాక్ వీడియోలోని మాటలే నిజమయ్యాయి. యాదృచ్చికంగా జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎం.కొత్తవలసకు చెందిన ఎం. వినోద్ గంట్యాడ మండలం పెదమజ్జిపాలెంకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి వరకు ఆనందంగా గడిపాడు. ఈ సంవత్సరానికి ఇదే చివరి సెల్ఫీ అంటూ వీడియో చిత్రీకరించాడు. ఇది చిత్రీకరించిన కొద్ది గంటలకే ముగ్గురు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. బొండపల్లి మండలం యడ్లపాలెం సమీపంలో అర్ధరాత్రి దాటాక బైక్‌తో తాటి చెట్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో వినోద్ పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయాడు. మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories