యూట్యూబ్ పిచ్చి ముదిరి! రైలు కింద గ్యాస్ సిలిండర్..

యూట్యూబ్ పిచ్చి ముదిరి! రైలు కింద గ్యాస్ సిలిండర్..
x
Highlights

తన సొంత యూట్యూబ్ ఛానల్‌కు అధిక వ్యూస్ రావాలని మనిషనేవాడు ఏ మాత్రం ఊహించని దారుణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్, వ్యూస్, లైక్స్ సంఖ్యను పెంచుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడటానికి ప్రయత్నించాడు.

తన సొంత యూట్యూబ్ ఛానల్‌కు అధిక వ్యూస్ రావాలని మనిషనేవాడు ఏ మాత్రం ఊహించని దారుణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్, వ్యూస్, లైక్స్ సంఖ్యను పెంచుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడటానికి ప్రయత్నించాడు. ఆ యువకుడి చేసిన పిచ్చి పని వల్ల వందలాది మంది రైలు ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలు అయ్యేవి. అదృష్టం బాగుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించాలనే ఆశతో శ్రుతిమించి ప్రయత్నించి ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెల్లుకూరుకు చెందిన రామిరెడ్డి, రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌, ద్విచక్రవాహనాలు పెట్టి వాటిని రైలు తొక్కినట్లు చిత్రీకరించి, యూట్యూబ్‌లో పెట్టేవాడు.

అయితే గతంలో కూడా ఇలాంటి వీడియోలు పెట్టిడంతో పెద్దఎత్తున వ్యూస్ రావడంతో ఈసారి ఏకంగా ఓ సిలిండర్ ను పట్టాల మీద పెట్టాడు. ఇక దానిపై రైలు వెళ్తే ఎలా ఉంటుందో షూట్ చేయాలనుకున్నాడు. అయితే అదృష్టం బాగుండి ఈ ఘటనలో పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. రైలు సిలిండర్‌ను ఢీకొట్టడంతో వేగంగా దూరంగా సిలిండర్ ఎగిరిపడింది కానీ పేలలేదు. అయితే హైదరాబాద్‌కు చెందిన నరసింహ అనే వ్యక్తి యూట్యూబ్ లో వీడియోలను చూసి ఇలాంటి ప్రయత్నాలతో ప్రమాదాలు జరుగుతాయని ట్విటర్‌ ద్వారా ఓ వ్యక్తి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రామిరెడ్డిని అరెస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియోను చూసిన వారంతా ఇదేం పిచ్చిపని అంటూ రామిరెడ్డిని పొట్టుపొట్టు తిడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories