వృద్ధురాలి కష్టాన్ని తెలుసుకొని బియ్యం బస్తా మోసిన వైసీపీ ఎమ్మెల్యే

వృద్ధురాలి కష్టాన్ని తెలుసుకొని బియ్యం బస్తా మోసిన వైసీపీ ఎమ్మెల్యే
x
YCP MLA chelluboina venu gopala krishna
Highlights

లాక్ డౌన్ నేపధ్యంలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులూ ప్రజలకి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

లాక్ డౌన్ నేపధ్యంలో కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులూ ప్రజలకి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.మాస్క్ లు, శానిటైజర్లు ఉచ్చితంగా పంపిణి చేయడం. ఇంటింటికి కూరగాయలను పంపిణి చేయడం వంటివి చేస్తున్నారు. ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ కూడా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా రేషన్ పంపిణిపై ఆయనే స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలపై అడిగి తెలుసుకుంటున్నారు. క్యూ లైన్లు, సామాజిక దూరం పాటించాలని చెబుతున్నారు.

ఈ క్రమంలో రేషన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధురాలి సమస్యను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. షాపులో రేషన్ తీసుకున్నానని కానీ ఆ బస్తా బరువు ఎక్కువగా ఉండటంతో మోసుకెళ్లలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. దీనితో ఆ ఎమ్మెల్యే స్వయంగానే ఆ బస్తాను తీసుకుని తన భుజాలపైకి ఎత్తుకొని ఇంటి వరకు మోసుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వృద్ధురాలి కష్టాన్ని తెలుసుకుని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ తీరుపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో గంటగంటకు కరోనా వైరస్ లు పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రం మరో 24 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కి చేరింది.ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి అర్జా శ్రీకాంత్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్క రోజులోనే 67 నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. బుధవరం పాజిటివ్‌గా తేలినవారిలో ఎక్కువ మంది ఢిల్లీ మార్కజ్ వెళ్లివచ్చినవారు, వారితో కంటాక్ లో ఉన్నవారేనని తెలుస్తోంది.

గుంటూరులో 20, కృష్ణా జిల్లాలో 15, ప్రకాశం 15, కడప 15, పశ్చిమ గోదావరిి 14, విశాఖపట్నం 11, తూర్పు గోదావరి 9, చిత్తూర్ 6, నెల్లూరు 3, కర్నూల్ 1, అనంతపురం2 కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories