Top
logo

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతల కౌంటర్ ఎటాక్‌

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతల కౌంటర్ ఎటాక్‌చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతల కౌంటర్ ఎటాక్‌
Highlights

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్యయాత్ర కాదు...

చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు చేసేది ప్రజా చైతన్యయాత్ర కాదు పచ్చి భూతుల యాత్ర అంటూ ఎద్దెవా చేశారు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి. చంద్రబాబు మద్యాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

14 ఏళ‌్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో మంచినీటి సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితులకు ఎకరా భూమిని కూడా ఇవ్వని చంద్రబాబు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. పరిశ్రమల పేరుతో చంద్రబాబు రియల్ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ఆరోపించారు.

Web Titleycp leaders counter attack on chandrababu praja chaitanya yatra
Next Story


లైవ్ టీవి