Top
logo

ఐదేళ్లలో రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా మార్చారు: వాసిరెడ్డి పద్మ

ఐదేళ్లలో రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా మార్చారు: వాసిరెడ్డి పద్మ
X
Highlights

మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ని చంద్రబాబు అప్పుల...

మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ని చంద్రబాబు అప్పుల ప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో చేసిన అక్రమాలన్నీ త్వరలోనే బయటికొస్తాయని అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా మార్చారి విమర్శించిన వాసిరెడ్డి పద్మా... విచారణ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులపై వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. "మీరు గెలిచిన స్థానాలన్నీ అత్తెసరు ఓట్లతో గెలిచారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించారు. 151 స్థానాల్లో తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. అలాంటి వ్యక్తిని 'గారు' అని పిలవడానికి మీకు మనసు రావడంలేదా? జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. ఈ దేశంలో ఎవరికీ రానంతగా 50 శాతం ఓటింగ్ తో ఆయన సీఎం పీఠం అధిష్ఠించారు. ప్రజలు అంత గొప్పగా గెలిపించిన వ్యక్తిని ఏకవచనంతో పిలుస్తారా? ప్రజలకు గౌరవం ఇవ్వడమే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఇవాళ మీరు ప్రజలు ఎన్నుకున్న నాయకుడ్ని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అక్రమాన్ని అక్రమం అంటే మీకెందుకు ఉలుకు? " అంటూ ధ్వజమెత్తారు.


Next Story