మా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు : దేవినేని అవినాష్

మా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు : దేవినేని అవినాష్
x
Highlights

శాసనమండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేతల దాడిని వై‌సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్‌ తీవ్రంగా ఖండించారు....

శాసనమండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేతల దాడిని వై‌సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్‌ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల దాడిని ఖండిస్తూ గుణదలలోని అతని నివాసం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దేవినేని అవినాష్ వ్యాఖ్యలు యధాతథంగా.. పెద్దల సభలో మంత్రి మీద దాడి దేశ చరిత్రలో ఎపుడూ చూడలేదు. టీడీపీ సభ్యులు అందరూ రౌడి లుగా, గుండాలుగా వ్యవహరించారు. హుందాతనం లేని వాళ్ళు, కాల్ మనీ కేసులు ఉన్నవాళ్లు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని అనుకుంటే మండలిలో, కోర్టుల్లో అడ్డుకుంటున్నారు. మా మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దు. గత 5 ఏళ్ళు రౌడీయిజం చేశారు. మరలా అలాంటివి చేస్తాం అంటే కుదరదు.

సభలో ఫోటోలు, వీడియో లు తీసి సోషల్ మీడియా టీం కి ఇస్తున్నారు. సోషల్ మీడియా లొనే టీడీపీ పార్టీ ఉంది.. గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ లేదు. విధ్వంసాలు అరాచకాలు చేస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సమయం సందర్భం లేకుండా సభలో సభ్యులను రెచ్చగొట్టారు. ప్రజా ప్రతినిది మీద దాడి చేసిన విధానం పై పోలీసు కమిషనర్ కి పిర్యాదు చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్లు, డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories