ఈ నూతి నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారట

ఈ నూతి నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారట
x
Highlights

పూర్వం మనమంతా గ్రామాల్లో నూతిలో నీళ్లే తోడుకుని తాగేవాళ్లం తర్వాతర్వాత ఆధునిక టెక్నాలజీతో రక్షిత నీరు ప్లాంట్లు కుళాయిలు ఇంటింటికీ సరఫరా వచ్చేసింది....

పూర్వం మనమంతా గ్రామాల్లో నూతిలో నీళ్లే తోడుకుని తాగేవాళ్లం తర్వాతర్వాత ఆధునిక టెక్నాలజీతో రక్షిత నీరు ప్లాంట్లు కుళాయిలు ఇంటింటికీ సరఫరా వచ్చేసింది. అయితే నూతిలో నీళ్లే ఎంతో శ్రేష్టమని గ్రామాల్లో పెద్దలు ఇప్పటికీ చెబుతూ వుంటారు. ఇప్పటికీ నూతినీళ్లే తాగే గ్రామాలు, పెద్దలూ లేకపోలేదు.. అయితే అలాంటి కోవలోనిదే ఓ నుయ్యింది. ఆ నూతిలోనీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారట పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారట సర్వరోగాలు నయమవుతాయట ఏమిటీ ఆ నుయ్యి మహా‌త్యం అనుకుంటున్నారా. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఈ బావికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఆషామాషీ ప్రత్యేకత కాదు. సంతానం కోసం ఎక్కని కొండ, మొక్కని బండ లేదన్నట్టుగా ఉన్న దంపతులు ఈ బావి నీళ్లు ఒక్కసారి తాగితే సరి!! పండంటి పిల్లలు పుడతారాట. అందుకే ఆ గ్రామంలోని నూతినీళ్లు కోసం జనం క్యూ కడుతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండంలం పాత దొడ్డిగుంట గ్రామం. పాత దొడ్డిగుంట గ్రామ జనాభా ఎక్కువే. ఈ ఊరికి బయట ఓ చెరువు గట్టున నీళ్ల బావి వుంది. ఆ నుయ్యి వద్దకు జనం వాటర్ టిన్‌లతో క్యూ కడుతున్నారు. ఎక్కడెక్కడ నుంచే నీళ్లకోసం పనికట్టుకుని వచ్చి తోడ్కుని వెళుతుంటారు. గబగబా నూతి దగ్గరకు రావడం నీళ్లు తోడుకుని వాటర్ టిన్ లలో పోసుకుని సైకిళ్లకు, మోటారు సైకిళ్లకూ కట్టుకోవడం, కార్లలో పెట్టుకుని తీసుకుపోవడం దృశ్యాలు నిత్యం కన్పిస్తూనే వుంటాయి ఈ బావి దగ్గరకు వచ్చే వాళ్లను కదిలిస్తుంటే అసలు విషయం చెబుతున్నారు.

ఈ దొడ్డిగుంట ఊరిలోని ఈ నూతినీళ్లు తాగితే కవల పిల్లలు తప్పకుండా పుడతారట. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందట. మంచాన పడ్డవారు కూడా లేచి కూర్చుంటారట ఇవి నమ్మశక్యమా అంటే మనమేమీ నిర్ధారించలేము కానీ, ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి అది అక్షరాల సత్యం అని అనుకోవాలి అంతే. ఏదిఏమైనా ఆ నూతి నీటిలో ఏముందో ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి తగిన పరిశోధనలు చేయించి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories