logo

2011 బకాయిలను కూడా తాము క్లియర్‌ చేశాం: చంద్రబాబు

2011 బకాయిలను కూడా తాము క్లియర్‌ చేశాం: చంద్రబాబు
Highlights

టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదన్న సీఎం జగన్ ఆరోపణలకు చంద్రబాబు సభలో సమాధానం ఇచ్చారు....

టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదన్న సీఎం జగన్ ఆరోపణలకు చంద్రబాబు సభలో సమాధానం ఇచ్చారు. వడ్డీలేని రుణాలు చెల్లించామని ధ్రువీకరిస్తూ అధికారులు జారీ చేసిన లేఖలను చంద్రబాబు సభలో చూపించారు. టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి పైసా కూడా ఇవ్వలేదని తనను రాజీనామా చేయాలని సవాల్ చేస్తారా? అంటూ సీఎం జగన్‌‌పై చంద్రబాబు మండిపడ్డారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్‌ చేశామన్నారు. టీడీపీ హయాంలో రుణాలు రీషెడ్యూల్‌ చేయలేదన్నారు కరువు మండలాలను ప్రకటించాక రుణాలు రీషెడ్యూల్‌ అవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.


లైవ్ టీవి


Share it
Top