వైసీపీతో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు?

వైసీపీతో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు?
x
Highlights

వైసీపీ డోర్ తెరిస్తే రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని, హింట్ లాంటి వార్నింగ్‌ ఇచ్చారు సీఎం జగన్‌. ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో...

వైసీపీ డోర్ తెరిస్తే రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని, హింట్ లాంటి వార్నింగ్‌ ఇచ్చారు సీఎం జగన్‌. ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని ఒక వైసీపీ సీనియర్‌ నేత ఏకంగా నెంబరే చెప్పారు. దీంతో ఇప్పుడు ఆ ఎనిమిది మంది ఎవరు ఎక్కడివారు అని, అందరూ తెగ ఆలోచిస్తున్నారు. నిజంగా ఎనిమిది మంది వైసీపీతో టచ్‌లో ఉన్నారా..? ఉంటే ఎవరువారు.? వైసీపీ డోర్లు మూసేస్తే, ఆ 8 మంది కుడికాలు పెట్టడానికి తలుపులు తెరిచి సిద్దంగా ఉన్న మరో పార్టీ ఏది..?

విన్నారుగా. ఇదీ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వార్నింగ్‌. తాను డోర్ తెరిస్తే ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెప్పాలా అంటూ భవిష్యత్‌‌‌‌లో ఏం జరగనుందో సంకేతమిచ్చారు జగన్మోహన్‌రెడ్డి. మరి జగన్‌తో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు? జగనే కాదు, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ కూడా చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని హింట్ ఇచ్చారు. అంతేకాదు, ఎనిమిది తెలుగుదేశం శాసన సభ్యులు ఫోన్‌లు చేస్తున్నారని, వారిలో ఇద్దరు తనతో మాట్లాడారని, ఏకంగా నెంబర్‌ చెప్పేశారు కోటంరెడ్డి.ఇదే ఇప్పుడు అలజడి రేపుతోంది. మరి గోడదూకేందుకు సిద్దంగా ఉన్న ఎనిమిది ఎమ్మెల్యేలు ఎవరు అదే బాబును టెన్షన్ పెడుతోంది.

తెలుగుదేశం మొత్తం ఎమ్మెల్యేలు 23 మంది. ఉత్తరాంధ్ర నుంచి ఆరుగురు గెలిచారు. వీరిలో ఇద్దరు తమను సంప్రదిస్తున్నారని వైసీపీ నేతలంటున్నారు. వారి పేర్లను మాత్రం వెల్లడించడం లేదు. రాయలసీమ నుంచి టీడీపీ గెలిచింది ముగ్గురే ముగ్గురు. వారిలో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ ఉన్నారు. వీరు ముగ్గురూ వైసీపీ తీర్థం పుచ్చుకునే ఛాన్సేలేదన్నది ఎవరినడిగినా చెబుతారు. అంటే సీమ నుంచి వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నవాళ్లు ఎవరూ లేరు. ఇక మిగిలింది మిగతా కోస్తాంధ్ర.23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 14 మంది కోస్తాంధ్ర నుంచే గెలిచారు. కృష్ణా, గుంటూరుల నుంచి ఇద్దరు ఎమ్మల్యేలు వైసీపీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. మిగతా నలుగురు ఉభయగోదావరి జిల్లాలతో పాటు మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల వారని, వైసీపీ నేతలే చెబుతున్నారు.

ఇలా ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు, కోస్తాంధ్ర నుంచి ఆరుగురు తెలుగుదేశం శాసన సభ్యులు, వైసీపీలోకి వస్తామని తమను సంప్రదిస్తున్నారని, అధికారపక్ష నాయకులంటున్నారు. దీంతో ఫిరాయింపులపై చంద్రబాబు మదిలో గుబులు రేగుతోంది. ఎవరు ఆ ఎమ్మెల్యేలు, వారిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అసెంబ్లీ జగన్‌ చేసిన ప్రకటన మాత్రం బాబుకు ధైర్యమిస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నది ఆ ప్రకటన సారాంశం. అయితే, వైసీపీ డోర్లు మూసేస్తే, మరో జాతీయ పార్టీ తలుపులను బార్లా తెరిచింది. టీడీపీకి భవిష్యత్తులేదని బెంగపడుతున్న తెలుగు తమ్ముళ్లు చాలామందికి, రెడ్‌ కార్పెట్ పరిచేందుకు సిద్దమవుతోంది. అదే బీజేపీ.

పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలను, తెలంగాణలో కాంగ్రెస్‌ను రీప్లేస్ చేసి, జెండా పాతాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాగా వేయాలని స్కెచ్‌ వేస్తోంది. చంద్రబాబుకు వయసు అయిపోతోందని, టీడీపీకి భవిష్యత్తు లేదని, తమ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పలుకుతోంది. ఇప్పటికే చాలామంది నేతలు బీజేపీ సీనియర్‌ నేతలతో మాట్లాడుతున్నారట. చంద్రబాబుకు కుడి భుజంలాంటి, రాయలసీమకు చెందిన ఒక నాయకుడు కూడా త్వరలో బీజేపీలో చేేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడట. మొత్తానికి వైసీపీ డోర్లు మూసేసినా, బీజేపీ మాత్రం తలుపులు తెరిచే ఉంచుతోంది. కేంద్రంలోనూ అధికారంలో ఉండటం, అమిత్‌ షా పకడ్బందీ వ్యూహాలతో ఏపీలో టీడీపీని రీప్లేస్ చేయాలని తపిస్తోందట. జగన్‌ మాటలతో బాబుకు హ్యాపీగా ఉన్నా, బీజేపీ దూకుడుతో మాత్రం కాస్త బెంగ పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏపీలో రానున్నకాలంలో ఏం జరుగుతుందో చూడాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories