కియా కంపెనీని ఏపీకి తెచ్చిందెవరు?

కియా కంపెనీని ఏపీకి తెచ్చిందెవరు?
x
Highlights

కియా కంపెనీని ఏపీకి తెచ్చిందెవరు? కియా ప్రాజెక్టు అనంతకు రావడం వెనుక ఘనతెవరిది? చంద్రబాబు అష్టకష్టాలు పడితే ఏపీకి కియా వచ్చిందా? లేక వైఎస్‌ లేఖలు...

కియా కంపెనీని ఏపీకి తెచ్చిందెవరు? కియా ప్రాజెక్టు అనంతకు రావడం వెనుక ఘనతెవరిది? చంద్రబాబు అష్టకష్టాలు పడితే ఏపీకి కియా వచ్చిందా? లేక వైఎస్‌ లేఖలు రాస్తే వచ్చిందా? ఈ ఇద్దరూ కాకుండా ప్రధాని మోడీ కృషితోనే ఆంధ్రాకు కార్ల కంపెనీ వచ్చిందా? ఇంతకీ కియా కంపెనీ రాక వెనుక క్రెడిట్‌ ఎవరిది? ఏపీ అసెంబ్లీ వేదికగా సాగిన వాదులాటపై స్పెషల్ స్టోరీ.

సక్సెసైన ప్రతి ప్రాజెక్టును తమ ఖాతాలో వేసుకోవడం, అది తమ ఘనతేనని చెప్పుకోవడం, తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి, ప్రతి పార్టీ ప్రయత్నించడం సహజం. ఏపీ అసెంబ్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. అనంతలో ఏర్పాటైన కియా కార్ల కంపెనీ.... తమ వల్ల వచ్చిందంటే.... తమ వల్లే వచ్చిందంటూ వైసీపీ, టీడీపీలు వాదులాటకు దిగాయి. కియా కంపెనీ అధ్యక్షుడు, సీఈవోలు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డికి రాసిన లేఖలను ఆర్ధికమంత్రి బుగ్గన అసెంబ్లీలో బయటపెట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి కృషితోనే ఏపీకి కియా ప్రాజెక్టు వచ్చిందన్నారు. ఆనాడు వైఎస్‌ కోరినందువల్లే ఏపీలో కంపెనీ స్థాపించామన్న కియా యాజమాన్యం రాసిన లేఖను సభ ముందు పెట్టారు. అప్పుడు వైఎస్ లేఖలు రాయబట్టే... కియా కంపెనీ ఏపీకి వచ్చిందని, ఇందులో బాబు ఘనతేమీ లేదని బుగ్గన బాంబు పేల్చారు.

బుగ్గన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కియా ఎవరి వల్ల రాష్ట్రానికి వచ్చిందో అందరికీ తెలుసని, ప్రజలేమీ అమాయకులు కాదన్నారు. పరిశ్రమలను తీసుకురావడంలో వైఎస్‌కు గానీ, ఆయన మంత్రులకు గానీ... కనీస అవగాహన లేదని, ఆనాడు వోక్స్‌ వ్యాగన్ కంపెనీ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. వోక్స్‌ వ్యాగన్ కంపెనీని ఏపీకి తేవడం కోసం వైఎస్ ప్రభుత్వం మధ్యవర్తులను నియమించుకుని 13కోట్లు చెల్లిస్తే, పరిశ్రమ ఏర్పాటు చేయకుండా, ఆ సొమ్ముతో ఉడాయించారని, ఇందులో ఆనాటి మంత్రి బొత్స నిర్వాకం కూడా అందరికీ తెలుసన్నారు. తాము చేయలేని పని ఇతరులు చేస్తే, అది కూడా తమ ఘనతేనని చెప్పుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శలు గుప్పించారు.

టీడీపీ-వైసీపీ వాదన ఇలాగుంటే, తమ వల్లే కియా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోడీ స్వయంగా.... ఆ కంపెనీ సీఈవోతో మాట్లాడి, ఏపీకి కియా వచ్చేలా చేశారని కమలనాథులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంమీద కియా ప్రాజెక్టును తాము తెచ్చామంటే, తాము తెచ్చామంటూ టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు వాదులాడుకుంటూ క్రెడిట్‌ కోసం ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories