లగడపాటి - నూతన్.. వీళ్లిద్దరి లింకేంటీ?

లగడపాటి - నూతన్.. వీళ్లిద్దరి లింకేంటీ?
x
Highlights

ఒకరు ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు పొందిన బిజినెస్ మెన్ కామ్ పొలిటీషియన్.. ఇంకొకరు కామం మ్యాన్ గా చెప్పుకునే చిన్నపాటి సెలబ్రిటీ.. రాజకీయాలు చేయాలనే...

ఒకరు ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు పొందిన బిజినెస్ మెన్ కామ్ పొలిటీషియన్.. ఇంకొకరు కామం మ్యాన్ గా చెప్పుకునే చిన్నపాటి సెలబ్రిటీ.. రాజకీయాలు చేయాలనే అభిలాషి! వీళ్ళిద్దరూ గతం లో ఎక్కడా కల్సి కనిపించిన సందర్భాలు లేవు. ఇందులో ఒకరు లగడపాటి.. రెండవ వ్యక్తి నూతన్ నాయుడు. లగడపాటి అనగానే ఆయనెవరో తెలుగు రాష్ట్రాల్లో ఠక్కున చెప్పేస్తారు. మరి నూత్న నాయుడు అనే కంటే బిగ్ బాస్ నూతన్ అంటేనే ఎక్కువ మంది గుర్తుపడతారు. ఇదెందుకంటే లగడపాటి రాజగోపాల్ అనేది బ్రాండ్ లాంటిది. నూతన నాయుడు అనేదాని ముందు బ్రాండ్ తగిలిస్తేనే కానీ తెలీని పేరు. మరి వీళ్లిద్దరికీ లింకేంటి? ఎక్కడన్నా ఫంక్షన్ లో కలిసినపుడు పక్క పక్క నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు కానీ.. రాజకీయాలకు సంబంధించిన సర్వే ఫలితాలు ప్రకటిస్తున్నపుడు లగడపాటి పక్కనే నూతన్ నాయుడు కూర్చోడమే ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు వీరిద్దరి మధ్య సంబంధమేమిటనే ప్రశ్నను లేవనెత్తింది. లగడపాటి పక్కనే హుందాగా తెల్లచొక్కా వేసుకుని మీడియా ముందు కనిపించారు నూతన్ నాయుడు. బిగ్ బాస్ సీజన్ 2లో కామన్ మేన్ ఎంట్రీ ఇచ్చి.. తన పలుకుబడితో రెండోసారి కూడా రీ ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీగా మారిపోయారు నూతన్ నాయుడు. అయితే ఆయన సడెన్‌గా లగడపాటి పక్కన కనిపించడం.. అసలు లగడపాటికి నూతన్ నాయుడుకి సంబంధం ఏమిటి? ఒకవేళ వ్యక్తిగత మైన పరిచయాలు ఉంటే.. కీలకమైన ఎన్నికల సర్వే ఫలితాలప్పుడు లగడపాటి పక్కన ఆయన ఎందుకున్నాడంటూ అనేక అనుమానాలు ఆ ప్రెస్ మీట్ చూసిన వారిలో వ్యక్తమయ్యాయి. వారిద్దరూ వేదికను పంచుకోవడం అందులోనూ కీలకమైన సర్వే ఫలితాల ప్రకటన సమయంలో.. కొంచెం వింతగానే కనిపించింది అందరికీ!

Show Full Article
Print Article
Next Story
More Stories