logo

వైఎస్సార్ ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టూ కొనసాగించాం

వైఎస్సార్ ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టూ కొనసాగించాం

మేం అధికారంలోకి వచ్చాకా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఏ ప్రాజక్టునూ ఆపలేడని ఎమ్మెల్యే అచ్చన్నాయుడు చెప్పారు. గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన తరువాత ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద పలు కీలక ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఏ ప్రాజెక్టునూ ఆపలేదని గుర్తుచేశారు. 'అభివృద్ధి అన్నది నిరంతరంగా సాగే ప్రక్రియ. గత ప్రభుత్వాలు చేశాయి కాబట్టి మేం అపేస్తాం అంటే ప్రజలే నష్టపోతారు' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం రైతులకు అదనంగా ఏం చేసినా స్వాగతిస్తామనీ, ప్రస్తుతం మిగతా రెండు విడతల రుణాలను మాఫీ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

లైవ్ టీవి

Share it
Top