జల జగడంలో ఫిర్యాదుల పర్వం!

జల జగడంలో ఫిర్యాదుల పర్వం!
x
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతుంది. పోతిరెడ్డిపాడు పై తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదుకు స్పందించిన కృష్ణ రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ...

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతుంది. పోతిరెడ్డిపాడు పై తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదుకు స్పందించిన కృష్ణ రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. దాంతో గోదావరి జలాలపై తెలంగాణ ప్రాజెక్టులన్నీ అక్రమమే అంటూ ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల బోర్డుకు ఫిర్యాదు చేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది గోదావరి జలాల బోర్డు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. పోతిరెడ్డిపాడు మీద ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 తో ప్రారంభం అయిన ఈ జలజగడం రచ్చ ఇంకా కొనసాగుతోంది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దానికి రివర్ బోర్డులు ఆయా ప్రభుత్వాలను వివరణ అడుగుతున్నాయి.

పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 తీసుకొచ్చింది. ఈ జీవో అక్రమం అంటూ కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ లేఖ రాసింది. అయితే ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన నీటి కంటే ఎక్కువే వాడుకుందని ఇక నీటి విడుదలను ఆపాలని కృష్ణాబోర్డు తెలిపింది.

మరోవైపు కృష్ణానది నీటి మీద వివరణ ఇస్తూనే మరో వైపు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఏడు కొత్త ప్రాజెక్టులు, వాడుకున్న నీళ్లు, విభజన చట్టం ఉల్లంఘనల గురించి వివరాలు, డీపీఆర్ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం కోరింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, తుమ్మిళ్ల లిప్ట్ ఇరిగేషన్ ల గురించి వివరణ కోరింది.

గోదావరి నదీ జలాలపై ఏపీ ప్రభుత్వం తెలంగాణపై గోదావరి జలాల బోర్డుకు కంప్లైట్ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి బోర్డు లేఖ రాసింది. గోదావరి బేసిన్ పరిధిలో తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులపై బోర్డు వివరణ కోరింది. గోదావరి జలాలపై తెలంగాణ ప్రభుత్వం ఏయే ప్రాజెక్టులు నిర్మించిందో నీటి వినియోగ లెక్కలు చెప్పాలంటూ లేఖలో పేర్కొంది.

మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారా స్థాయికి చేరుతోంది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories