Top
logo

ధవళేశ్వరం వద్ద14.70 అడుగులు నీటిమట్టం

ధవళేశ్వరం వద్ద14.70 అడుగులు నీటిమట్టం
Highlights

15 రోజులైన గోదారి శాంతించడం లేదు. మహోగ్రరూపమై పొంగి ప్రవహిస్తూ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, ఏజెన్సీ...

15 రోజులైన గోదారి శాంతించడం లేదు. మహోగ్రరూపమై పొంగి ప్రవహిస్తూ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలను ముంచెత్తుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 14 పాయింట్ 7 అడుగుల వరద నీటి మట్టం కొనసాగుతోంది. బ్యారేజీకి 17 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ... మొత్తం 175 గేట్లు ఎత్తి 14లక్షల క్యూసెక్కులు దాటి వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దిగువన వశిష్ట, వైనతే, గౌతమీ ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఇటు దేవీపట్నం మండలం మరింతగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. 36 గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గోదావరి జిల్లాల్లో మరో వంద గ్రామాలు వరద తాకిడిలో ఉన్నాయి.

Next Story

లైవ్ టీవి


Share it