పగపట్టిన సుడిగుండం

పగపట్టిన సుడిగుండం
x
Highlights

గోదావరిలో విహార యాత్రను సుడిగుండం విషాదయాత్రగా మార్చింది. అప్పటి వరకు నవ్వుతూ ఎంజాయ్ చేసిన వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఆహ్లాదంగా జలసిరుల్లో...

గోదావరిలో విహార యాత్రను సుడిగుండం విషాదయాత్రగా మార్చింది. అప్పటి వరకు నవ్వుతూ ఎంజాయ్ చేసిన వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఆహ్లాదంగా జలసిరుల్లో సాగిపోతున్న వారంతా కానరాని లోకాలకు పోతామని ఎవ్వరూ ఊహించలేకపోయారు. సుడిగుండంలో చిక్కుకకోవడంతో బోటు మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా దేవీపట్నం మండలంలోని పోశమ్మ గుడి నుండి పాపికొండల వరకు ఎక్కడా ప్రమాదకర పరిస్థితులు తెలియచేస్తూ సూచికలు కూడా లేకపోవడం ప్రమాదానికి దారి తీసింది.

సుడిగుండం వారిపై పగబట్టింది పాపికొండల అందాలు వీక్షించాలనుకుని పర్యాటకులు ఇదే ఆఖరి ప్రయాణం అవుతుందని పసిగట్టలేకపోయారు. దేవీపట్నం మండలం కచలూరు దగ్గర తరచీ సుడిగుండాలు సంభవిస్తుంటాయి. అదే మాదిరిగా రాయల్ వశిష్ట లాంచీ సుడిగుండంలో చిక్కుకుని బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై విశ్లేషిస్తున్న జలవనరుల శాఖ అధికారులు కూడా ఇదే చెబుతున్నారు.

పర్యాటకంగా ఎంతో ప్రసిద్ది చెందిన పాపికొండలు. ఎప్పటి నుంచో పాపికొండల ప్రయాణం చేస్తుంటారు. దశాబ్దాలుగా రాజమహేంద్ర వరం నుంచి భద్రాచలం వరకు జలమార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని పర్యాటకులు చెబుతుంటారు. దేవీపట్నం మండలం పోశమ్మ గుడి నుంచి పాపికొండల వరకు 62 కిలో మీటర్ల దూరంలో ఎక్కడా ప్రమాద పరిస్థితులు తెలియచేస్తూ హెచ్చరిక సూచికలు కూడా లేకపోవడం కూడా విహారయాత్రలు విషాదయాత్రలుగా మిగిలిపోతున్నాయి.

రాజమహేంద్ర వరం, పట్టిసీమ, సింగనపల్లి, పోశమ్మ గుడి నుంచి పాపికొండల వరకు ప్రయణించే సమయంలో నీటి ప్రవాహానికి ఎదురీదుతూ వెళ్లాల్సి ఉంటుంది. ముందుకు వెళ్తున్నా కొద్దీ కొండల మధ్య గోదావరి సన్నగా ప్రవహిస్తుంటుంది. కొండ అడ్డుగా ఉండటంతో సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి సుడిగుండంలో చిక్కుకున్న వెంటనే లాంచీలు పెద్ద పెద్ద బండరాళ్లను ఢీకొని బోల్తాపడటం కానీ రంద్రం పడి నీరు లోపలికి వచ్చే అవకాశం ఉంటుందని జలవనరుల శాఖ నిపుణులు చెబుతున్నారు. కచ్చులూరు దగ్గర గోదావరి వరద ప్రవాహం వడి.. సుడి కలిసి బోటు ప్రమాదానికి దారి తీసినట్లుగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories